ప్రకృతి లోని అద్భుతాలు ఎన్నో.. వాటిని వర్ణించడం ఎవరితరమూ కాదు. ఇక ప్రకృతిలో కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన జీవరాసులు కూడా ఉంటాయి. వాటిని చూసినప్పుడు మన కల్లను మనమే నమ్మలేము. ఎందుకంటే అలాంటి విచిత్రమైన జీవుల ను ఎప్పుడూ చూసి ఎరుగము కాబట్టి. ఒకప్పుడు అయితే ఇలాంటి వింత జీవులను చూడడానికి అవకాశం ఉండేది కాదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో వింత జీవులు చూడగలుగుతున్నాం.
తాజాగా ఒక వింత జీవి కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇక ఈ జీవి ఏంటి అన్నది మాత్రం నెటిజన్లను అయోమయంలో పడేస్తోంది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కాస్త ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక వైపు నుంచి చూస్తే పాము మరో వైపు నుంచి చూస్తే సాలీడు... ఈ రెండు జీవరాసుల పోలికలు పోలి ఉంది ఈ కొత్త జీవి. దీంతో ఇది పామా లేక సాలిడా అన్నది అర్థం కాక నెటిజన్లు అందరూ జుట్టూ పీక్కుంటున్నారు.
కాగా 32 సెకండ్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు 2.9 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది ఈ వీడియో. ఇక ఈ కొత్త జీవి పై నెటిజన్లు కూడా సరికొత్తగా కామెంట్లు పెడుతున్నారు. ఈ జీవి 2020లో ఒక అద్భుతం అని కొంతమంది కామెంట్ పెడితే.. తాబేలు ను మింగ బోయిన పాము అంటూ మరి కొంతమంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వింత జీవి ఏంటో మీరైనా గుర్తు పట్టగలరా..?