కుక్కలను ఇంట్లో పెంచుకుంటే ఎన్ని రకాలుగా ఊపయోగ పడుతాయో అందరికి తెలిసిన విషయమే.. కానీ ఈ మధ్య కాలంలో కుక్కలకు ప్రత్యేకమైనా శిక్షణ ఇచ్చి వాటిని పసిపిల్లల సంరక్షణకు కూడా ఊపయోగించుకుంటున్నారు.. అవి పిల్లలను ఆడించడంతో పాటుగా, ఎవరైన ఆ పసి వారికి హాని చేయాలని చూస్తే పసిగట్టి ఎదురుతిరుగుతున్నాయి కూడా.. ఇలాంటి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి..

 

 

ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక బుడ్డోడికి చేసిన ఎడ్ల బండి భలేగా ఉంది.. కాని ఈ బండిని ఇక్కడ కుక్క నడపడం విశేషం.. ఇకపోతే చిన్నపిల్లలను సరదాగా కాసేపు బయట తిప్పితే కాస్త చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే.. అందుకే కావచ్చూ ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఒక మంచి ఆలోచన చేసి చిన్నపాటి రెండు చక్రాల బండిని తయారు చేసి వీడిని అందులో కర్చోబెట్టగా వారి పెంపుడు కుక్క ఏం చక్కా ఆ బండికున్న రింగ్‌ను తన మెడకు తగిలించుకుని వాన్ని ఆలా షికారుకు తీసుకెళ్లుతుంది.. ఇక ఆ బండి పై బుల్లిరాజులా కూర్చున్న బుడ్డోడిని ఆ కుక్క లాక్కెళ్లుతున్న దృశ్యం చూడముచ్చటగా ఉంది..

 

 

కాగా పిల్లలు ఏడుస్తూ సతాయిస్తుంటే ఇలాంటి ఆలోచనతో వారి మారాన్ని తగ్గించవచ్చూ, వారు అలా ఆడుకుంటున్న సమయం లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలి. ఇకపోతే ఇలా వింతగా వచ్చిన ఆలోచనను అమలుచేసి తన పుత్రుడికి సంతోషాన్ని ఇచ్చే విధంగా ప్రవర్తించిన ఆ తల్లిదండ్రులను నెటిజన్స్ అభినందించకుండా ఉండలేకపోతున్నారు.. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ తెగ హల్‌చల్ చేస్తుంది..

 

 

ఈ వీడియో చూసిన వారిని కూడా విస్మయానికి గురిచేస్తుందట.. ఇక పిల్లలపై ఉన్న ప్రేమకు తోడుగా ఇలా విన్నూతమైనా ఆలోచనలు కలిస్తే వారు ఆడుకోవడానికి ఇలాంటి కొత్త కొత్త వస్తువులు పుడతాయంటున్నారు కొందరు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: