మన చేతికి ఉన్న వేళ్లు అన్ని ఒకేలా ఉండవో, లోకంలోని మనుషులు వారి, మనస్తత్వాలు కూడా ఒకే తీరులో ఉండవు.. ఎందుకంటే కొందరు భయస్తులుంటారు, మరికొందరు ధైర్యస్తులు ఉంటారు.. భయంగా జీవితాన్ని గడపడం ఎంత నష్టమో, అసలు భయం లేకుండా జీవించడం కూడా అంతే నష్టం.. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కొందరు మనుషులు కుక్కలతో స్నేహం చేసినట్లుగా కౄరమృగాలతో కూడా ప్రవర్తిస్తుంటారు.. పులులు, సింహాలను దూరం నుండి చూస్తేనే భయం పరిచయం అవుతుంది.. చెడ్డితడిసిపోతుంది.. అలాంటిది వాటితో ఏదో చిన్నపిల్లలతో ఆటలు ఆడినట్లుగా ఆడటం అంటే మాటలు కాదు.. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా ఇలాంటిదే..

 

 

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి సరదా కోసం ఈ పులులను పెంచుకుంటున్నాడు కావచ్చూ.. ఇతను కనిపించగానే అవి అతని మీదికి ఎక్కి చూసే వారు ఎన్ని రకాలుగా భయపడాలో అన్ని రకాలుగా భయపడేలా అతనితో ప్రవర్తిస్తుంటాయి.. ఇతను మాత్రం వాటి చర్యలను చాలా తేలిగ్గా తీసుకుని, పెంపుడు కుక్కలను, పిల్లులను సముదాయించినట్లుగా సర్దిచెబుతుంటాడు. ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసే వారికి మాత్రం ప్రాణాలు పోయినంత పని అవుతుంది..

 

 

ఎందుకంటే మనుషులుగా పుట్టిన వారే రాక్షసులుగా మారి సాటి మనుషుల ప్రాణాలు దయలేకుండా తీస్తున్నారు.. అలాంటిది అసలే అవి అడవి మృగాలు.. వాటికి మంచి చెడులు అనే ఆలోచనలు ఉండవు.. ఎప్పుడు చిర్రెత్తితే అప్పుడు రక్తం రుచి చూస్తాయి. ఎదురుగా ఉన్న జీవులను నిర్ధాక్షిణ్యంగా చంపేస్తాయి ఎంత ఇంట్లో పెంచుకుంటే మాత్రం కౄరమృగాలు సాధు జంతువులు అయిపోతాయా.. పెంపుడు కుక్కలే యజమానులను చంపిన సందర్భాలున్నాయి.. ఇక పులుల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అని అంటున్నారట నెటిజన్స్.. ఏది ఏమైనా పిచ్చిలో ఇదో రకమైనా పిచ్చి అంటున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: