గుండెల్లో ధైర్యముంటే చాలు ఎంతపెద్ద సవాల్ అయినా ఎదుర్కోవచ్చు అంటారు.. సవాల్ అయితే ఎదుర్కొంటాము కానీ మనకంటే భారీ ఆకారాన్ని ఎదుర్కోవాలంటే ధైర్యముతో పాటు తెలివి, బలం కూడా కావాలి.. కానీ ఒక కోడి పెట్టకు ఉన్న ధైర్యము గురించి అందరికి తెలిసిందే.. ఎందుకంటే కోడి అనబడే ఈ పక్షి అన్నీటికి భయపడుతూ బ్రతకాలి.. కుక్కలకు, పిల్లులకు, చివరికి మనుషులకు కూడా.. కానీ దానికున్న ధైర్యం గురించి ఎవరికి తెలియదు.. దాని డేర్ ముందు మనుషులం అనబడే మనం కూడా పిరికి వారిలా పారిపోవలసిందే.. అందుకే ఈ కోడిని ఎంత పొగిడిన తక్కువే అనిపిస్తుంది..

 

 

ఇక శివాజీ సినిమాలో రజనీకాంత్ ఒక డైలాగ్ చెబుతారు.. అదేమంటే నాన్న పందులే గుంపులుగా వస్తాయ్... సింహం సింగిల్‌గా వస్తుంది. ఈ డైలాగ్ అక్షరాల ఈ కోడిపెట్టకు సరిపోతుంది.. ఎందుకంటే ఇది తనకంటే ఆకారంలో, బలంలో పెద్దవైనా ఎద్దులనే పరిగెత్తించింది.. ఒక ఎద్దు కాదు.. ఓ పది ఎద్దుల వరకు ఉన్న వాటిని భయంతో పారిపోయేలా చేసింది.. ఇక ఈ క్రింది వీడియోలో చూస్తే పచ్చని గడ్దిలో ఆ కోడి తన ఆహారాన్ని ఏరుకుని తింటుండగా, అక్కడే ఉన్న ఎద్దుల మంద ఈ కోడిని చూడగా, అందులో ఉన్న ఒక ఎద్దు ఏదో పోటుగాడిలా దీని మీద దాడి చేయడానికి ప్రయత్నించింది..

 

 

మామూలుగా ఇలాంటి సమయంలో కోళ్లు పారిపోతాయి. కానీ ఈ కోడి అలా వెన్నుచూపలే.. నామీదికే వస్తావా ఉండూ నీ పనిచెబుతా అని ఎగిరి ఒక్క షాట్ ఇచ్చింది. అంతే ఆ ఎద్దుల మంద దూరంగా పారిపోయింది. ఇలా ఒక్క సారి కాదు, పదే పదే ఆ మందలో ఉన్న ఎద్దు, కోడి మీదికి దాడిచేయడానికి ప్రయత్నించగా వాటిని తరిమి కొట్టింది..

 

 

నిజానికి ఈ వీడియోలో కనిపించే ఈ దృశ్యంలో నీతి ఏంటంటే.. బలవంతున్ని ఎదుర్కోవాలంటే ఎదుటి వారు బలవంతులు కావలసిన అవసరం లేదు.. ధైర్యం ఉంటే చాలు ప్రత్యర్ధులను పరిగెత్తించవచ్చని ఈ కోడి పెట్ట నిరూపించింది.. ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియెను మీరు చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: