రోజులు మారాయి. ఎంతలా ఉంటే.. ఊహకు అందనంతగా. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లిని ఎంజాయ్ చేయాలే కానీ.. అందుకు భిన్నంగా ఉద్యోగ ఒత్తిడితో సతమతమవుతూ పెళ్లి చేసుకోవటం.. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగానే ఉద్యోగ ఒత్తిడి ఉందో? లేదంటే రోటీన్ కు కాస్త భిన్నంగా వ్యవహరించాలని అనుకున్నారో కానీ.. ఏ మాత్రం జీర్ణించుకోలేని రీతిలో ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

 

ఇంతకీ వైరల్ వీడియోలో ఏమున్నదన్నది చూస్తే.. గ్రాండ్ గా వేదిక. అంతకు మించి ఖరీదైన దుస్తుల్లో వెలిగిపోతున్న కొత్త జంట. మహమ్మారి కారణంగా తక్కువ మంది హాజరైన ఈ వేడుకలో ఇంతకు ముందెప్పుడూ చూడని ఒక సీన్ కనిపించింది. అదేమంటే.. వేడుకకు హాజరైన వారు నూతన వధూవరుల్ని ఆశీర్వదించటం ఒక అలవాటు. లైఫ్ లో ఒకసారి జరిగే పెళ్లి వేడుకను ఎంజాయ్ చేస్తుంటారు.

 

కానీ.. ఇక్కడ మాత్రం పెళ్లి కుమార్తె చేతిలో సెల్ ఫోన్ లో జూమ్ కాల్ అటెండ్ అవుతూ.. ఒళ్లో ల్యాప్ టాప్ పెట్టుకొని బిజీబిజీగా ఉన్న వైనం విస్తుపోయేలా మారింది. వేదిక మీద ఆమె ఒక్కతే ఉండటం.. కాసేపటికి ఆమె పక్కకు వచ్చి కూర్చున్న పెళ్లి కుమారుడు ఆమె పరిస్థితికి ఎలా స్పందించాలో అర్థం కాక కామ్ గా ఉండిపోవటం కనిపిస్తుంది. బంధువులు అంద‌రూ షాక్ అయిపోయారు.

 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రాండ్ గా  పెళ్లి చేసుకుంటూ.. ఖరీదైన కాస్ట్యూమ్స్ అంతా సందడిగా ఉన్న వేళ.. సీన్ కు ఏ మాత్రం సూట్ కాని ల్యాప్ టాప్ తో పని చేయాల్సినంత అవసరమైన పని ఏమిటి? అన్న ఆసక్తితో పాటు.. ఆమె ఉన్నపరిస్థితుల్లో పని చెప్పిన కంపెనీని అనాలన్న ఆగ్రహాన్ని నెటిజన్లు ప్రదర్శిస్తున్నారు. ఏది ఏమైనా.. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఆమె చేసిన పనిని మాత్రం చాలామంది కరెక్టు కాదంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: