ప్రేమలు అప్యాయతలు ఒక మనుషులకే కాదు. ఈ పుడమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటాయి.కానీ మనుషులు బయట పడినంత త్వరగా మిగతావి బయటపడవు. ఇక పెంపుడు జంతువులు అయితే ఆహారం పెట్టినందుకు ఎంతో విశ్వాసంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.. కానీ మనుషుల మనసులే రాళ్లలా కఠినంగా మారుతున్నాయి.. నానాటికి మనిషికి పెరుగుతున్న అవసరాల రిత్యా, ఉరుకుల పరుగుల జీవితంలో బంధాలను, అప్యాయతలను మరచి ఒక యంత్రంలా తయారు అవుతున్నాడు.. అంతెందుకు నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులే నేటికాలంలో భారంగా మారుతున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నందుకు సిగ్గుపడాలి..

 

 

ఇంతటి మలినమైన మనుషుల మధ్య మూగజీవుల ప్రేమలు ఎందరికి కనిపిస్తాయి.. నిజానికి మనుషుల కంటే మూగజీవాలే ఎంతో నయం.. వాటికి హాని చేసినా అవి పగతో రగిలిపోవు.. ద్వేషంతో ప్రతీకారం తీర్చుకోవు.. ప్రతి జీవిలో ఉన్న ప్రాణం ఒక్కటే కానీ రూపాలే వేరు.. అందుకే కొందరికి జంతువులతో, పక్షులతో విడదీయరాని బంధం ఏర్పడుతుంది... అవి దూరమైనప్పుడు వాటితో బంధాన్నిపెనవేసుకున్న వారు ఎంతలా దుఖిస్తారో, అంతలా ఆ జంతువులు, పక్షులు కూడా తమ బాధను వ్యక్తం చేస్తాయి.. ఒక్కోసారి జంతువుల, పక్షుల విశ్వాసం చూస్తే మనుషులుగా మనం ఏ స్దాయిలో బ్రతుకుతున్నామో ఆలోచించవలసిన అవసరం ఉందనిపిస్తుంది..

 

 

ఇకపోతే ఇక్కడ మనం చూడబోయే వీడియోలో కనిపించే చింపాంజీ పేరు వుండా.. దీన్ని కొంతమంది జంతు ప్రేమికులు అడవిలో విడిచిపెట్టడానికి వచ్చినప్పుడు ఇంతకాలం తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ప్రతివారిని ప్రేమగా పలకరిస్తూ, అత్తవారింటికి వెళ్లే కన్న కూతురిలా దీనంగా, మూగగా రోదిస్తుంది.. అసలు వారిని విడిపెట్టి ఉండలేక, బలవంతగా అడవిలోకి వెళ్లిపోతుంది.. ఈ చింపాంజీ ప్రేమను చూస్తే నేటికాలంలో కడుపున పుట్టిన పిల్లలు కూడా తల్లిదండ్రులకు దూరంగా వెళ్లుచున్నప్పుడు ఇంతలా బాధపడరని అనిపిస్తుంది..

 

 

ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మూగజీవుల భావోద్వేగాన్ని అర్ధం చేసుకోవడానికి మనుషులుగా మనం సరిపోవేమో అని అంటున్నారు.. ఇక హృదయానికి హత్తుకునేలా ఉన్న ఈ వీడియోను మీరు మనసుతో చూడండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: