ప్రపంచానికి కరోనా పరిచయం అయినప్పటి నుండి ఈ వైరస్‌కు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా అది కాస్త వైరల్ అవుతుంది.. అదీగాక కరోనా వైరస్ విషయంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసిన కొద్ది, కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక వైద్యులైతే కరోనా విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పే వీడియోలు, సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.. అంతే కాకుండా మనుషులు కరోనా బారిన పడి అనారోగ్యంతో కాకుండా ఆరోగ్యంతో జీవించడానికి తీసుకునే సలహాలు, సూచనలు ఎన్నో అందుబాటులో లభిస్తున్నాయి..

 

 

ఇకపోతే కరోనా వైరస్ రోజు రోజుకు విసృతంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో భయపడే వారు భయపడుతున్నారు.. కొందరైతే ఎప్పుడైనా చావవలసిందే కనీసం ఉన్నని రోజులైనా ఎంజాయ్ చేద్దాం అంటూ ఈ వైరస్‌ను పలువురికి అంటిస్తున్నారు.. ఒకరకంగా ప్రభుత్వం గొలుసుకట్టు వ్యాపారాలనే పూర్తిగా నిలపలేకపోయింది, ఇక అదే వ్యాపారానికి అంబాసిడర్‌లా కొనసాగుతున్న కరోనా వ్యాప్తిని ఆపాలంటే మాటలు కాదు.. అందుకే కావచ్చు కొన్ని చోట్ల అధికారులు మీ చావు మీరు చావండని చేతులెత్తేసారని అనుకుంటున్నారట ప్రజలు..

 

 

ఈ నేపధ్యంలో యావత్ ప్రజలు కరోనా విషయంలో ఏయే జాగ్రత్తలు తీసుకుంటే బ్రతికి బట్టకడతారో మనకు ఒక కుక్క చెబుతుంది.. కుక్క కరోనా గురించి చెప్పడం ఏంటని అదిరిపడకండి, ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే జంతువుల నుండి కూడా కరోనా సోకుతుందని మనుషులు ప్రచారం చేస్తున్నారని ఫీలైన ఈ శునకం కూడా తనకు తోచిన సలహాలను ఇవ్వడానికి సిద్దపడింది..

 

 

కాకపోతే ఈ బాష అందరికి అర్ధం కాదు కాబట్టి ఈ వీడియో చూసిన వారిలో ఎవరికైనా ఏమైనా కరోనా విషయంలో కుక్క ఇస్తున్న సలహాలు అర్ధం అయితే  ఇతరులకు చెప్పడం మాత్రం మరవకండి.. ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుందట.. అందుకే మీరు ఓ లుక్కు వేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: