నేటి సమాజంలో మంచితనం, మానవత్వం అనేవి అందమైన పదాలుగా మారి.. చేస్తున్న మోసాలను కప్పిపుచ్చుకోవడానికి వాడే పదాలుగా మారిపోయాయి.. చిన్న రొట్టెముక్క కోసం ఆశపడిన ఎలుక బోనులో చిక్కుకున్నట్లుగా మనుషులు అవసరం అనేదాన్ని ఆయుధంగా మలచుకుని, తమ పబ్బం గడుపుకుంటూ, కోపతాపాలతో విచక్షణ కోల్పోయి సాటి వారి ప్రాణాలకు హాని తలపెట్టడానికి కూడా వెనకా ముందు ఆలోచించడం లేదు..

 

 

ఈ మానవ జన్మ ఎత్తింది నీతి నిజాయితీతో కూడిన క్రమ బద్దమైన జీవితాన్ని గడపడానికి కానీ, అషిద్దం తినే పందుల వలే, చెడు అనే బురదలో దొర్లుతూ జీవితాన్ని గడపడం కాదు.. అంతే కాకుండా అందరిలోనూ ఉన్న పరమాత్మను పూజించకుండా తోటి వారిపట్ల ఎంత కర్కశంగా ప్రవర్తిస్తున్నావో ఒక్క సారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. మనుషులుగా ఎంతలా దిగజారిపోయామో.. ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఇద్దరి మనుషుల మధ్య జరిగిన ఘర్షణ ఒకతన్ని కౄరునిగా మార్చేసింది..

 

 

ఆ సమయంలో అతను ఎంత నికృష్టమైన పనికి పాలపడుతున్నాడో ఆలోచించే స్దితిలో లేడు. ఇంతకు ఏం జరిగిందంటే. జేసీబీ డ్రైవర్‌తో ఒక వ్యక్తికి ఏ కారణంగా గొడవ జరిగిందో తెలియదు గానీ, ఆ జేసీబీ డ్రైవర్ సదరు వ్యక్తి పై ఏకంగా జేసీబీతోనే దాడికి పాల్పడ్డాడు. తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో జరిగిన ఈ దారుణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

 

ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సోడి సూరయ్య.. ఇతనికి ఆ డ్రైవర్‌కు మాటా మాట పెరిగి పెద్దదవగా, ఆ జేసీబీ డ్రైవర్ కోపాన్ని అదుపు చేసుకోలేక జేసీబీకి ఉన్న తొట్టెతో ఆ వ్యక్తి తలపై గట్టిగా కొట్టాడు.. తలపై ఒక్కసారిగా జేసీబీ తొట్టె తగలడంతో సూరయ్య అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ ఘటనను అందరు చూస్తున్న వారే గాని ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.. కాగా ఆ వీడియో మానవ హక్కుల సంఘాల దృష్టికి వెళ్లగా వారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారట.. ఏది ఏమైనా మానవత్వం ఉన్న మనిషి చేయవలసిన పనికాదు అని నెటిజన్స్ కూడా చివాట్లు పెడుతున్నారట.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: