లోకంలో కొందరిని చూస్తే ఎంతో శక్తి వచ్చినట్లుగా అనిపిస్తుంది.. ఎందుకంటే గమ్యం కోసం చేసే సాధనకు శక్తితో, వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తువుంటారు.. ఇలాంటి వారిని చూస్తే ఆశ్చర్యం కూడా కలుగుతుంది.. ఇన్ని విద్యలు వీరు ఎలా నేర్చుకున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది.. ఇలాంటి వీడియోనే ఇక్కడ ఇప్పుడు మనం చూడబోయేది.. ఈ వీడియోలో కనిపించే బుడతడు ఫుట్‌బాల్‌తో గారడీ చేస్తాడు. ఇలా ఒకటి లేదా రెండు సార్లు కాదట..

 

 

నిజానికి ఇలా చేయాలంటే చాలా ప్రాక్టీసు ఉండాలి. మరి ఈ పిల్లవాడు ఏవయస్సు నుండి ఫుట్‌బాల్‌తో ఆడటం నేర్చుకు న్నాడోగానీ, ఇతని ఆట చూస్తే మాత్రం అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నట్లుగా, ఈ పిల్లవాడు ఇతని తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఫుట్‌బాల్ ఆటలో ఉన్న మెలకువలు పసిగట్టినట్లుగా ఉన్నాడనిపిస్తుంది. ఆ ఫుట్‌బాల్ కిందపడకుండా తన రెండు కాళ్లతో ఎలా బ్యాలన్స్ చేస్తున్నాడో ఈ వీడియోలో చూసిన వారు కూడా నమ్మలేకపోతారు..

 

 

ఇకపోతే ఈ వీడియోను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం షేర్ చేయగా ఈ బుల్లిపిట్టగానీ ఆటను చూసిన నెటిజన్స్ అయితే బాబోయ్ ఈ వయసులో నమ్మశక్యం కాని నైపుణ్యం అంటూ ఫిదా అయిపోతున్నారు. అదీగాక ఆ బాల్ బ్యాలన్సింగ్ చూస్తే ఇతను ఇలాగనుక సాధన చేస్తే రాబోయే కాలంలో పెద్ద  ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అవతరిస్తాడని అనుకుంటున్నారు..

 

 

ఇదే కాకుండా కొందరు నెటిజన్స్ అయితే వీడు భవిష్యత్తులో పెద్ద ఛాంపియన్ అవుతాడని లవ్ ఎమోజీలు పెడుతున్నారట.. ఏది ఏమైనా ఇతని తల్లిదండ్రులను కూడా అభినందించాలి.. వారి ప్రోత్సాహమే లేకుంటే వీడు సోషల్ మీడియాలో హల్ చల్ చేసేవాడు కాదు. ఆటలో నైపుణ్యత ప్రదర్శించే వాడు కాదు.. ఈ ప్రోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పిల్లాడు మంచి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరు సాధిస్తాడని నమ్మడంలో అనుమానం లేదు.. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర్‌ల్‌గా మారింది..  

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on

మరింత సమాచారం తెలుసుకోండి: