విమాన ప్రయాణం అంటేనే చాలా వ్యయంతో కూడుకున్నది అనే విషయం తెలిసిందే.. ఇక విమాన చార్జీలు ఏరేంజ్‌లో ఉంటాయో, ప్రయాణికులకు వారందించే సౌకర్యాలు కూడా అదే స్దాయిలో ఉంటాయి.. కానీ ఇప్పుడు మనం చూడబోయే విమానంలో జరిగిన చిత్రం ఏంటంటే ఈ విమానంలో ప్రయాణించే ప్రయాణికుల నెత్తి మీద వర్షపు చినుకులు పడగా వారంత గొడుగులుపట్టుకుని కూర్చున్నారు.. వింటుంటేనే వింతగా అనిపిస్తుంది కదా.. ఇక ఈ పరిస్దితిని స్వయంగా అనుభవించే వారు ఇంకా ఎలా ఫీలవుతారో మరీ.. అసలే కింద నేల, పైన ఆ కాశం.. మధ్యలో తడచుకుంటూ విమాన ప్రయాణం.. వావ్ ఇలాంటి అద్భుతమైన ప్రయాణం దక్కడం చాలా అదృష్టం.

 

 

ఇకపోతే వర్షం వస్తే ఇళ్లు, భవంతులు చివరికి బస్సులు కురవగా చూశాం కానీ, విమానంలో నీళ్లు కురవడమా అని ఆశ్చర్యపోకండి.ఎందుకంటే ఈ రికార్డును మొట్ట మొదటిసారి సొంతం చేసుకుంది రోసియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం. ఆ వివరాలు చూస్తే. ఖబరోవ్స్క్ నుంచి సోచికి బయలుదేరిన విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా భారీ వర్షం మొదలైందట.. ఆ వర్షానికి విమానంలో అక్కడక్కడా నీరు కురవడం మొదలైందట. దీంతో సిబ్బంది గొడుగులను అందించగా కొందరు ప్రయాణికులు తడవకుండా గొడుగులు పట్టుకున్నారు. మరికొందరు ఆ నీటిలో తడుస్తూ ఎంజాయ్ చేశారట..

 

 

ఇక ఈ తతంగాన్నంతా అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో కాస్తా వైరల్‌ అయింది. కాగా ఈ ఘటన పై దర్యాప్తు చేసిన అధికారులకు తెలిసిన విషయం ఏంటంటే వర్షం కారణంగా క్యాబిన్‌లో నీరు లీకేజీ కాలేదట, ఏసీ వ్యవస్థ దెబ్బతినడంతోనే ఇలా జరిగిందని తెలిపారు.. సమస్య ఏదైనా విమానంలో వర్షం అనేది హాట్ టాపిక్‌గా మారడంతో అందరు ఈ విషయం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: