ఈ సృష్టిలో అమ్మ అనే పదం ఎంత మకరందమైనదో, ప్రకృతి సౌందర్యం కూడా ఈ పిలుపుకు ఏం తీసిపోదు.. ఎందుకంటే ఈ ప్రకృతి కూడా అమ్మ స్దానంలోనే ఉన్నది గనుక.. ఈ సృష్టిలో ప్రకృతి ఇచ్చే సందేశం అద్భుతంగా ఉంటుంది.. ఎలాగంటే.. పుట్టే ప్రతీ ప్రాణినీ హృదయభాషతో స్వాగతిస్తూ, అభేధ భావంతో ఆదరిస్తూ, నిర్మలంగా ప్రేమిస్తూ, నిశ్శబ్దంగా ఓదారుస్తూ, ఆత్మీయంగా అమ్మలా ఆదరిస్తుంది గనుక.. అందుకే అంటారు ఈ ప్రకృతి సౌందర్యం సమస్త జీవులకు ఓ ఆనంద వరం అని.. ఈ ప్రకృతి సౌందర్యంలో లీనమైతే చిరుగాలి గుసగుసలు, చిగురాకు రెపరెపలు, బండరాయి సైతం గుండెలో ఏదో మోగడానికి పడే ఉబలాటం మనసుకు అర్ధం అవుతాయి..

 

 

ఒక్కసారి మనో నేత్రాలతో ప్రకృతిని సందర్శిస్తే రంగు రంగు పూల సోయగాలతో నవ వధువులా ముస్తాబై ఆకుపచ్చగా మెరిసే పట్టులాంటి పచ్చికనే చీరగా కట్టుకున్న పుడమి తల్లి పులకింత, సూర్యకాంతిలో మెరిసే సప్త వర్ణ పుష్పాల కలబోత ఇవన్నీ ఈ ప్రకృతి కాంతలో కనిపిస్తాయి. అందుకే అంటారు ప్రకృతిలో లీనమైతే ప్రపంచాన్నే మరచిపోవచ్చని.. ఈ ప్రకృతి గురించి ఎంత పొగిడిన తక్కువే.. ఇకపోతే మనం ద్వీపాల గురించి వినే ఉంటాం.. కానీ కొత్త ద్వీపాలు ఎలా తయారు అవుతాయో చాల మందికి తెలిసి ఉండదనుకుంటా.. అందుకే ఈ వీడియోలో ప్రకృతి గర్భం నుండి పురుడుపోసుకుంటున్న ఓ కొత్త ద్వీపాన్ని చూడవచ్చూ..

 

 

సోలమన్ దీవులలో పసిఫిక్ మహాసముద్రం మధ్యలో కలుగుతున్న విస్పోటనం చూడండి.. అందమైన ప్రకృతి ఒక ద్వీపాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది.. ఇక నాలుగు దిక్కులా నీరున్న భూభాగాన్ని ద్వీపం అంటారు. అయితే ద్వీపాలనేవి రెండు రకాలుగా ఏర్పడతాయి. అవి కాలక్రమములో ప్రధాన ఖండమునుండి విడిపోయిన చిన్న భూభాగము ద్వీపంగా మారితే, లోతట్టు భూమికి మధ్యలో వున్నభాగము సముద్రమట్టం పెరిగి మునిగిపోగా ఒక ద్వీపం ఏర్పడవచ్చు.

 

 

ఇదే కాకుండా సముద్రములోని అగ్నిపర్వతాలు బద్దలైనపుడు పైకి ఎగిసిపడిన లావా నెమ్మదిగా ఒకచోట పేరుకుని కూడా ద్వీపంగా రూపు దిద్దుకుంటాయి. ప్రధాన నదులు సముద్రములోకి తెస్తున్న ఇసుక మేట వేయడం ద్వారా కూడా కొత్త ద్వీపం ఏర్పడుతుంది.అయితే ఇక్కడ సముద్రమట్టంలో కలిగే అలజడి వల్ల ఏర్పడుతున్న ద్వీపాన్ని చూడవచ్చూ.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: