ఇండియన్ ఆర్మీ.. ఈ పేరు పలుకుతుంటే నరాల్లో కోల్పోయిన శక్తి సైతం తిరిగి పుంజుకుంటుంది.. ప్రజల్లో ఆత్మస్దైర్యం రెపరెపలాడుతుంది.. అంతెందుకు కోట్ల ప్రజల గుండె చప్పుడే ఈ ఇండియన్ ఆర్మీ అని, శత్రువుల గుండెలు పగిలేలా అరవాలనిపిస్తుంది.. దేశంలో మనం అంతా ధైర్యంగా, స్వేచ్ఛగా జీవించగలగుతున్నామంటే అది భారత సైన్యం దయవల్లే..

 

 

తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతోన్న ఈ సైనికులు ఎండా-వాన‌ల‌కి చ‌లించ‌రు.. కొండా-కోన‌ల‌కి త‌ల‌వంచ‌రు. ప‌చ్చ‌ద‌న‌మే ఎరుగ‌ని ఎడారిలో ఉన్నా, రక్తం గడ్దకట్టే మంచులో ఉన్నా, చివరికి నేల‌నేది క‌నిపించ‌ని న‌డిసంద్రంలో ఉన్నా. వాళ్ల మ‌న‌సుల్లో ఉండే ఆలోచ‌న ఒకటే‌, వాళ్ల జీవితాల్లో ఉన్న ల‌క్ష్యం ఒక‌టే, వాళ్ల ప్రతి అడుగు, దేశ ర‌క్ష‌ణే ధ్యేయంగా కదులుతుంటే వారి వెంట ఉన్న మృత్యువు సైతం ముఖం చాటేస్తుంది.. ఒకరకంగా సైనికుడంటే తాను బ్రతికినంత కాలం తన జీవితాన్ని ఇండియాకు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.. అందుకే సైనికులకు ఎన్ని వేల కృత‌జ్ఞ‌త‌లు అందించినా, ఏదో రుణం మిగిలిపోయే ఉంటుంది..

 

 

ఇక వారి సాహసాలను ఏ తీరుగా వర్ణించినా ఆ అక్షరాలకు సంపూర్ణత చేకూరదని అనిపిస్తుంది.. అయితే ఇప్పటి వరకు సైనికుల విన్యాసాలు ఎలా ఉంటాయో చాలా సినిమాల్లో చూసి ఉంటాం.. అలాగే సోషల్ మీడియాలో వారి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు చాలా అరుదుగా దొరుకుతాయి.. అలాంటి అరుదైన వీడియోనే ఇప్పుడు మనం చూడబోయేది.. అచ్చం సినిమా షూటింగ్‌నే తలపించేలా ఉన్న ఈ వీడియోలో, జవాన్‌లు ఉగ్రవాదులను ఎంత సమర్ధవంతంగా ఎదుర్కొంటారో స్వయంగా చేసి చూపించారు..

 

 

ఇదేగాక ఉగ్రవాదులు వాహనాలను హైజాక్ చేసినప్పుడు, అందులో ఉన్న ప్రజలను ఎలా రక్షించాలో కూడా తమ విన్యాసాలతో తెలిపారు.. ఇక వీరి సాహసాల గురించి మనకు తెలిసినా, ఇలా ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే వీరే కదా నిజమైన హీరోలు అనిపిస్తుంది.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో మన ఇండియన్ ఆర్మీ చేస్తున్న సాహస విన్యాసాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెప్ప వేయకుండా ఉత్కంఠంగా గమనిస్తుండటం విశేషం.. ఇక మన ఇండియన్ ఆర్మీ దేనికైనా తెగిస్తారు అని చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.. జై ఇండియా ఆర్మీ..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: