విజయం సాధించటానికి ఒక మనిషి చేసే ప్రయత్నాల్లో ఎన్నో సమస్యలు, అడ్డంకులు వస్తాయి. కానీ ఆ అడ్డంకులను, సమస్యలను తట్టుకొని నిలబడిన వ్యక్తులను మాత్రమే విజయం వరిస్తుంది. ఏ పనిలోనైనా విజయం సాధించాలనుకునే వ్యక్తి ముఖ్యంగా పట్టుదలను కలిగి ఉండాలి. అలాంటి సమయంలోనే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా విజయం సాధించి విజేతగా నిలుస్తారు. 
 
జీవితంలో పట్టుదల ఉన్న వ్యక్తి ఏ విజయాన్నైనా సాధించగలడు. థామస్ అల్వా ఎడిసన్ ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో మొదట ఫెయిల్ అయినా పట్టుదలతో కష్టపడి బల్బ్ ను కు కనిపెట్టిన విషయం తెలిసిందే. కొన్ని పనులు చేయటం ద్వారా పట్టుదలను సులభంగా పెంచుకోవచ్చు. విజేతలకు, ఓడిపోయిన వారికి తేడా ఏమిటంటే విజేతలు ఎవరూ ప్రోత్సహించకున్నా, నిరుత్సాహపరిచినా పట్టుదలతో అనుకున్న పనిని సాధించటానికి కృషి చేస్తారు. 
 
పట్టుదలతో కృషి చేసిన వారు లక్ష్యాలకు దగ్గరగా వెళుతూ పట్టు పట్టి గట్టిగా నిలిచి ఇతరుల మెప్పును పొందుతారు. అడ్డంకులు ఎదురైనపుడు పట్టుదలతో ఒక అడుగు ముందుకు వేస్తే పట్టుదల మనకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. జీవితంలో ఓటమి ఎదురైతే ఓటమిని ఓటమిలా చూడకుండా ఓటమి నుండి ఏమి నేర్చుకోవాలో నేర్చుకొని ముందడుగు వేయాలి. లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా పట్టుదలతో చివరి వరకు కృషి చేస్తే విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: