జీవితంలో కొన్ని సందర్భాలలో మంచి అవకాశాలు వస్తాయి. అలా మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని జీవితంలో ఎదగటానికి కృషి చేయాలి. చాలా మంది ఒక ఉద్యోగం నుండి మరో ఉద్యోగానికి మారటానికి, ఒక చోటు నుండి మరో చోటుకు బదిలీ కావడానికి సంకోచిస్తారు. చాలా మంది మరొక ఊరుకు వెళ్లాల్సి వస్తే ఈ మాత్రం దానికి అంత దూరం వెళ్లాలా...? వాళ్లిచ్చే అంత తక్కువ జీతానికి అంత పని చేయాలా...? అని రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు. 
 
చాలా సందర్భాలలో ఉన్నచోటే ఉంటూ అదే ప్రపంచమనుకుంటూ ఆనందంగా గడిపుతున్నట్టు నటిస్తూ ఉంటారు. ఎదుటివారు పని సరిగ్గా చేయకపోతే ఆ పరిస్థితిలో నేనే ఉంటే అలా చేసేవాడిని... ఇలా చేసేవాడిని అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితి మానకే ఎదురైతే తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మనలో చాలా మందిలో ఇలాంటి ప్రవర్తన సహజంగా కనిపిస్తూనే ఉంటుంది. 
 
సమస్యలను ధైర్యంగా ఎదుర్కోలేక మనలో చాలామంది సమస్యల నుండి పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. చాలామంది తమకు అవకాశాలు రావడం లేదనే నెగిటివ్ భావనలో ఉంటారు. నెగిటివ్ ఆలోచనలతో తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటూ ఉంటారు. నెగిటివ్ ఆలోచనలతో చాలామంది ఆత్మన్యూనతా భావంతో ఉంటారు. ఈ నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడితే మాత్రమే లక్ష్య సాధన వైపు అడుగులు వేయవచ్చు. అందివచ్చిన అవకాశాలను జారవిడచుకుంటే నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదు. మనలో ఉన్న నెగిటివ్ భావనను వీడితే లక్ష్యాలను అందుకొని విజయాలను సాధించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: