చాలా మంది చాలా సందర్భాలలో విజయం సాధించడానికి ఎంతో కష్టపడుతున్నామని కానీ విజయం సాధించలేకపోతున్నామని చెబుతూ ఉంటారు. ఏ పనిలోనైనా విజయం సాధించలేకపోతున్నామంటే మీరు చేస్తున్న తప్పులే విజయానికి మిమ్మల్ని దూరం చేస్తున్నాయని గుర్తుంచుకోవాలి. చాలామంది ఏ పనినైనా తాము పూర్తి చేయకుండా ప్రతిదానికి ఇతరులపై ఆధారపడుతుంటారు. 
 
ఇతరులపై మీరు ఆధారపడటం వలన మీకు సొంతంగా ఆలోచించే ఆలోచనా శక్తి తగ్గుతుంది. ఏ చిన్న సందేహం వచ్చినా సొంతంగా ఆలోచించకుండా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఏ విషయాన్నైనా  సొంతంగా ఆలోచించకపోతే మీలో శక్తిసామర్థ్యాలు, బలాలు ఉన్నా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో, విజయాన్ని సాధించడంలో మాత్రం విఫలమవ్వాల్సి వస్తుంది. 
 
జీవితంలో చేపట్టిన ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ప్రతి చిన్న విషయాన్ని సమస్యగా చూడకుండా సానుకూల కోణంలో ఆలోచిస్తూ ఎవరైనా మన ఎదుగుదల కోసం మంచి విషయాలు చెబితే వారితో వాదనకు దిగకుండా ముందడుగులు వేయాలి. ఎవరైనా మనపై విమర్శలు చేస్తే విమర్శలను సైతం సానుకూలంగా తీసుకోవాలి. సమస్యలు ఎదురైతే ఆందోళన పడకుండా పరిష్కార మార్గాలను ఆలోచించాలి. విజయం సాధించటానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటూ, కష్టపడితే విజయం తప్పకుండా సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: