సృష్టిలో అత్యంత శక్తివంతమైనది అమ్మ. అమ్మే  మనకి తొలి నేస్తం. అమ్మ లేక జీవితం లేదు అమ్మ లేక పోతే జన్మే లేదు.  అమ్మ కోసం ఏం  చేసినా అది తక్కువే కదా.... అమ్మ కోసం  ఏమి  చేసినా, ఎంత  చేసినా ఆ ప్రేమకి సాటి ఏమి  లేదు కదా... అమ్మ ఇచ్చిన జన్మ లో బ్రతుకుతున్నాం. అటువంటి అమ్మకి ఏమి ఇస్తే ఏమిటి కానీ.... చిన్న నాటి నుండి ఎంతో జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచుతుంది అమ్మ. నీ బాధ ఆమెకి కన్నీరు, నీ గెలుపే ఆమెకి చిరునవ్వు. అమ్మ కష్టాల్లో తోడుగా ఉంటుంది. వ్రేలు పెట్టి అక్షరాలని దిద్దించడం నుండి జీవితాన్ని సక్రమంగా నడిపించే అంత వరకు కూడా అమ్మ వెలుగై ఉంటుంది. అమ్మ లేని బ్రతుకు చీకటే కదా,...

 

అమ్మకి ఏమి ఇచ్చిన తక్కువే అన్న ఉద్దేశం తో  బంగారు పాదాలు చేయించి వాటిలో తన తల్లిని చూసుకుని పూజిస్తున్నారు ప్రముఖ నటుడు వీకే నరేష్. నటుడు నరేష్ తన నుండి దూరం అయి పోయిన తన తల్లి పాదాలు చేయించి ఇంట్లో పెట్టాడు. ఈ నటుడు తన తల్లి ప్రేమకి ఏం చేసిన తక్కువే అన్న భావన తో ఈ బంగారు పాడాలని చేయించాడు. నిజంగా ఇది గొప్ప విషయమే కదా. ప్రజలంతా ఇతనికి జోహార్లు చెప్పక తప్పదు.

 

నరేష్ ప్రముఖ  నటి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్రహీత విజయనిర్మలకు నరేష్ కుమారుడు. తన తల్లి విజయనిర్మల కోసం ప్రేమతో ఈ పాదాలని చేయించాడు.అనగా  గురువారం (ఫిబ్రవరి 20న) విజయనిర్మల 74వ జయంతి. ఈ సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని భర్త సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: