అమ్మ అనే పదం ఎంతో తియ్యనిది. ఏ కల్మషం లేకుండా అమ్మ చిన్నప్పటి నుండి వెలుగుని అందిస్తూ బ్రతుకుని బాగు చేస్తుంది. అయితే ఒక్క సారి ఎవరైనా అమ్మ అని పలికితే వారి మనసులో ఎన్నో ఊహలు వస్తాయి. అలానే ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తు వస్తూనే ఉంటాయి. బుడి బుడి అడుగుల నుండి కూడా అమ్మ మంచి ప్రోత్సాహం ఇస్తూనే వచ్చింది కదా.

 

 

మొదట నీ అడుగు పడితే ఆమె ఎంతో ఆనందం తో పొంగిపోతుంది. అలానే  నీ ఆనందం ఆమె గెలుపుగా భావించి పెంచుతుంది. తల్లి ప్రేమ కి సాటి ఏది లేదు.  అత్యంత శక్తివంతమైనది అమ్మ ఈ సృష్టిలో. అమ్మ మంచి తోడుగా ఉంటుంది. బాధలో ధైర్యం ఇచ్చే స్నేహితుడు అవుతుంది, చదువు చెప్పే గురువు కూడా అవుతుంది. ఇలా అడుగడుగుల్లో....అణువణువులో అమ్మ ఉంటుంది.  

 

 

అమ్మ లేక ఈ  జీవితం లేనే లేదు . అమ్మ లేక పోతే అసలు మనకి ఈ జన్మే లేదు. అటువంటి అమ్మ  కోసం  ఏమి  చేసినా, ఎంత  చేసినా తక్కువే. లాలి లాలీ అని లాలించి ఆ ఉయ్యాలనే రారాజుని చేసి ప్రపంచాన్ని జయించే వీరుడిలా అమ్మ పెంచుతుంది. నిశిలో శశి ఆచూకీ లేదని ఆ మేఘాల పరదాని జరిపి కాంతివంతమైన శశిని చూపిస్తూ గోరు ముద్దలందిస్తుంది....

 

 

ఇలా అమ్మ బిడ్డకి సర్వసం తానై అండగా ఉంటుంది. అమ్మ నీడై, తోడై ప్రతీ క్షణాన్ని పంచుకుంటుంది. ఇలా అమ్మ కోసం ఎంత చెప్పిన తక్కువే... అమ్మ తో పంచుకున్నది బాధనైనా, నవ్వునైనా ఆ భావం పదే గుర్తుండి పోతుంది. కాబట్టి నవ్వుతూ అమ్మ తో ఆనందాల్ని పంచేయండి. అమ్మని కూడా నవ్వించేయండి. మరి ఆలస్యం ఎందుకు అమ్మతో క్షణాలని ఇప్పుడే పంచేసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: