దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 41 మంది కరోనా భారీన పడగా ఏపీలో 10 కేసులు నమోదయ్యాయి. ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా సోకకుండా తమను తాము రక్షించుకోవచ్చు. కరోనా సోకిన వారిలో నలత, గొంతు నొప్పి, చలి జ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఇతర లక్షణాలు ఉంటాయి. 
 
కరోనా సోకకుండా ఉండాలంటే తెలియనివారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోను తెలియని వారిని తాకడం, ముట్టుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఇతరుల కళ్లు, ముక్కు, నోరు భాగాలను తాకకూడదు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లకు పరిమితం కావడం మంచిది. ఒకవేళ అత్యవసర కారణాల వల్ల బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ కచ్చితంగా ధరించాలి. 
 
కరోనా ప్రభావం తగ్గేంత వరకు పెంపుడు జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. చేతులను శానిటైజర్ సహాయంతో తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. రోజులో వీలైనంత సమయం విశ్రాంతి తీసుకుంటూ .... నీరు ఎక్కువగా తాగుతుండాలి. కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 
 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple 

మరింత సమాచారం తెలుసుకోండి: