అమ్మ అన్న పదాన్ని దేవతలా కొలిచే పిల్లలు ఉన్నారు. కొడుకు కష్టాన్ని చూడలేని తల్లులు ఉన్నారు. ఇలా తల్లి బిడ్డల  ప్రేమ ఎనలేనిది. అమ్మ కోసం కొండలైన ఎక్కి ఏమైనా తెచ్చేయాలన్నంత ప్రేమ ఉంటుంది. అలానే బిడ్డ  కోసం కంచం లో ఉన్న బిడ్డకి  ఇష్టమైన కూర నుండి ప్రతీ దానిని త్యాగం చేస్తారు తల్లులు.

 

 

నిజంగా వారి మధ్య అనుబంధం దేనికి సాటి లేనిది. అమ్మ జన్మ మాత్రమే కాదు జననం నుండి ప్రతి క్షణం కూడా అనేకం త్యాగం చేస్తూనే ఉంటుంది. నిజంగా తల్లి దగ్గర ఉంటే ఎంత పెద్ద కష్టం అయినా కూడా అది ఎంతో సులువుగా అనిపిస్తుంది. గుండెల్లో భరించలేని దుఃఖం కూడా తల్లి ప్రేమతో మాయం అయిపోతుంది. ఇదే ఏమో అమ్మ చేసే మాయ.

 

ఏదో సినిమాలో చిరంజీవి కి  తన తల్లి జంతర్ మంతర్ ఇస్తే అన్ని దుఃఖాలు మాయం అయ్యినట్టు ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా ఆమె హత్తుకుంటే బాధ, బరువు ఏమి ఉండక మనసు ఎంతో హాయిగా, ప్రశాంతత తో ఉంటుంది. తల్లి తో ఏమైనా బాధని పంచుకోవడానికి ఎంతో మంది వెనుకడుగు వేస్తారు. అని ఇలా చెయ్యడం తప్పు. అమ్మతో చక్కగా సులువుగా ఏమైనా పంచుకుంటే దానికి పరిష్కారం ఆమె ఒక నేస్తమై చెబుతుంది.

 

అది కొండంత బాధైనా సరే చిటికెలో తొలగి పోతుంది. కాబట్టి అమ్మకి చెప్పుకోవడం నిజంగా మంచి లక్షణం. చిన్నప్పుడు నిద్ర పట్టకపోతే కధలు చెప్పిన అమ్మ ఇప్పుడు గాయాల్ని, బరువుని మాన్పించే పరిష్కారం అవుతుంది కదా...ఎంత బరువైన ఎంత బాధైనా చక్కగా మాన్పించే ఔషధం మన అమ్మ. కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రీగా అన్ని అమ్మతో పంచుకోండి...  ఆ బాధ నుండి ఇట్టే బయట పడతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: