ప్రతి ఒక్కరూ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని కలలు కంటారు. కొందరు ఆ కలలను నిజం చేసుకోవడంలో సక్సెస్ అయితే మరికొందరు మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. చాలామంది ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడుతూ ఉండటం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇతరులపై ఆధారపడితే సొంతంగా ఏదీ నేర్చుకోవడం సాధ్యం కాదు. అలాంటివాళ్లు జీవితంలో ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 
 
జీవితంలో లక్ష్యాలను సాధించే క్రమంలో వీలైనంతవరకు సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అలా నేర్చుకునే క్రమంలో కొత్త విషయాలు తెలుస్తాయి. ఇతరులపై ఆధారపడటం మొదలు పెడితే బద్ధకం పెరుగుతుంది. ఎలాంటి సమస్యలనైనా ఎవరికి వారు పరిష్కరించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. మొదట్లో కష్టంగా అనిపించినా ఆ అలవాటు వల్ల ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. 
 
ఇతరులపై ఆధారపడితే వారు అందుబాటులో లేని సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆలస్యంగానైనా విజయం తప్పక సొంతమవుతుంది. ఇతరులపై ఆధారపడటం వల్ల చాలా సందర్భాల్లో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించే క్రమంలో విజయం సులభంగా సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: