అమ్మ ప్రేమ కష్టాలని చూడ నివ్వదు. అనుక్షణం ఆనందాన్ని, నవ్వునే చూపిస్తుంది. అమ్మ అనే పదం నిత్యం తియ్యగానే ఉంటుంది. ప్రతీ సారి అమ్మ అని అంటూ ఉంటే తగిలిన దెబ్బ కూడా మాయం అయ్యిపోతుందేమో.... దరి చేరిన కష్టం కూడా వదిలి వెళ్లిపోతుందేమో. అమ్మ అంటే అనురాగం, ఆప్యాయత, అనందం ఏమో...

 

 

అమ్మ ప్రేమ ప్రతీ ఇళ్లలోనూ ఉంటుంది. అమ్మ ప్రేమని కొన్ని సినిమాలలో కూడా చూపించారు. వాటిలో కూడా అమ్మ ప్రేమని మనం చూడవచ్చు.చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రం లో తల్లి కొడుకుల బంధం కనిపిస్తుంది. ఎటువంటి దుఃఖం అయినా సరే అమ్మ హత్తుకుంటే అది తొలగిపోతుంది అని దానిలో చెబుతారు. సత్యం అది.

 

 

ఎందుకంటే బాధ తొలగిపోవాలంటే అది అమ్మతో పంచుకుంటే చాలు. కాబట్టి ఒక్క జంతర్ మంతర్ తో మనం బాధని విడువచ్చు.అలానే తల్లి మాట విని చిన్ని పాప అమ్మని విడిచి దూరంగా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అమల తల్లి పాత్ర చేసి మెప్పించింది. అయితే ఆ సినిమాలో కూడా తల్లికి మాట ఇచ్చారని వారు అనుక్షణం గుర్తు పెట్టుకుని ఆమె ప్రేమకి గౌరవం ఇస్తారు.

 

 

ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాలో ఎవరు నమ్మక పోయిన తన తల్లి కొడుకు గొప్పవాడు అవుతాడని నమ్ముతుంది. కాబట్టి ఎంత కాళీగా ఉన్నా కూడా ఆ కొడుకు మీద ఆమె విస్వాసం పెట్టుకుంటుంది. ఆ నమ్మకమే  గెలిపించిందేమో  కొడుకుని. 

 

ఇలా అనేక సినిమాలు తల్లి ప్రేమని కళ్ళకి కట్టినట్టు చూపించారు. మీరు కనుక మీ అమ్మకి, అమ్మ ప్రేమకి దూరంగా విదేశాల్లో గానీ, కాస్త దూర ప్రాంతాల్లో గాని ఉన్నట్టు అయితే ఏ పండుగ నాడైనా వెళ్ళడానికి ప్లేన్ చేసుకోండి  తల్లి తండ్రులతో గడిపేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: