అమ్మ వల్ల బిడ్డకి కేవలం ప్రేమ మాత్రమే కాదు. ప్రేమతో పాటు ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, అసలు మన సంస్కృతీ సంప్రదాయాలు ఏమిటి, ఎలా ప్రవర్తించాలి, మంచికి  చెడుకీ తేడా ఏమిటి ? ఎలా ఉంటే అది మంచిది, చేదు ఎందుకు చెయ్యకూడదు ఇలా అమ్మ బిడ్డకి ఎన్నో నేర్పితుంది. చదువుతో పాటు చక్కని నడవడిక, బుద్ధి, మంచి లక్షణాలు, నిజాయతి, నిస్వార్ధం ఇలా అనేకం నేర్చుకోవడానికి సాయ పడుతుంది అమ్మ.

 

కానీ చాలా మంది పిల్లలు అమ్మ మాటని లెక్క జేయరు. ఆమె ఏమి ఎక్కువగా చదువుకోలేదు, ఆమెకి ఏమి తెలియవు అని ఆమె చెప్పిన వాటిని తప్పు అని వినరు. ఇది నిజంగా తప్పు. ఈ ప్రవర్తన అస్సలు మంచిది కాదు. ఆమెకి ఉన్న అనుభవం ఎంతో. జీవితంలో తల్లి అనేకం చూస్తూ ఉంటుంది. అప్పటిలో చదువుకోక పోవడాయికి వివిధ కారణాలు ఉంది ఉంటాయి.

 

 

అయితే చదువుకోనంత మాత్రాన్న ఆమె మాటని కొట్టి పడేయడం నిజంగా తప్పు. ఆ ప్రవర్తన ఎంత మాత్రం మంచి అలవాటు కాదు. అలానే అమ్మ మన సంప్రదాయాలని పద్ధతులని చెప్తే వాటిని కేవలం మూఢ నమ్మకాలూ అని వినని పిల్లలు ఉన్నారు. ఇలా పాటించకపోవడం తప్పు. అమ్మ చెప్పిన మార్గం వెళ్లడమే కరెక్ట్. ఎందుకంటే పూర్వీకుల సంప్రదాయాన్ని సంస్కృతిని గౌరవించాలి.

 

 

వాటిని శ్రద్ధగా పాటిస్తే దాని వెనుక ఉన్న కారణాలు మనకి అర్ధం అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ముందు విని ఆచరించాలి. తల్లికి ఎదురు సమాధానం చెప్పి బాధ పెట్టకూడదు. ఆమె మాటని ఎంతో శ్రద్ధగా ఆలకించాలి. ఆమె చెప్పిన బాటలో నడవాలి. అమ్మ బిడ్డకి చెప్పే ప్రతీ మాట కూడా బిడ్డ మంచికే. ఆమె అహర్నిశం తపించేది బిడ్డ గెలుపు కోసమే కదా...

 

మరింత సమాచారం తెలుసుకోండి: