ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలలు కంటారు. కానీ కొందరు మాత్రమే ఆ కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. జీవితంలో విజయం పొందాలంటే తప్పనిసరిగా మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. మనకంటూ ఒక లక్ష్యం లేకపోతే మనం ఇతరుల లక్ష్యం కొరకు ఉపయోగించుకోబడతాం. 
 
ఎవరికైతే తమ లక్ష్యం మీద స్పష్టత ఉంటుందో వారికి విజయం సులభంగా సొంతమవుతుంది. మనకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరించి ఎంచుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతాం. లక్ష్యం లేని వారు అటూ ఇటూ తెగిన గాలిపటంలా తిరుగుతూ ఉంటారు. లక్ష్యాన్ని ఎంచుకోవడంతో పాటు ఆ లక్ష్యాన్ని సాధించడానికి చేయాల్సిన పనులను కూడా నిర్ణయించుకోవాలి. 
 
మనిషికి లక్ష్యం స్పష్టంగా తెలిస్తే మాత్రమే మన ఆలోచనలు అటు వైపు వెళతాయి. మన లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకుని లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి. ఇలా కృషి చేసిన వారు విజేతలుగా నిలిచిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. లక్ష్యాన్ని మనం సాధిస్తున్నట్లు ప్రతిరోజూ ఊహించుకోవడం వల్ల మనస్సు చాలా శక్తివంతమవుతుంది. ముఖ్యంగా లక్ష్యాన్ని సాధించే క్రమంలో వ్యక్తులుగా మనం చాలా ఎదుగుతాం. అలా ఒక లక్ష్యం మనకు ఎంతో లాభం చేకూర్చుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: