చాలామంది జీవితంలో గొప్పగొప్ప విజయాలను సాధించే సామర్థ్యం ఉన్నా బద్ధకం వల్ల సమయాన్ని వృథా చేస్తుంటారు. సోమరితనంతో ఇతరులకు చెడు అభిప్రాయం కలిగే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవిస్తూ జీవనం గడుపుతుంటారు. బద్ధకంతో ఉండేవారు ఎలాంటి పట్టుదల లేక ఏ పనిని సాధించలేక చివరికి సోమరులుగా మిగిలిపోతుంటారు. వీరు తమ ముందు ఉన్న పనిని ఎలా తప్పించుకోవాలని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. 
 
జీవితంలో ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే కలలు కంటే సరిపోదు.. ఆ కలలకు సరిపోయే కృషి చేయాలి. ఒక వ్యక్తి పూర్తి అంకితభావంతో లక్ష్యం కోసం శ్రమిస్తే మాత్రమే సులువుగా విజయం సొంతమవుతుంది. ప్రణాళికాబద్ధమైన శ్రమ పడటం ద్వారా కెరీర్ లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. లక్ష్యాన్ని స్పష్టంగా ఎంచుకుని అహర్నిశలు అంకిత భావంతో పని చేస్తే తప్పక విజేతలుగా నిలుస్తాము. 
 
బద్ధకంతో పని ఆలస్యం చేస్తే ఆ పని అంతా ఒకేసారి చేయాల్సి వస్తుంది. చాలా మంది కెరీర్ లో ఉన్నత లక్ష్యాలను పెట్టుకున్నా బద్ధకం వారిని ఆ పని చేయనివ్వదు. బద్ధకాన్ని వదిలించుకుని చురుకుగా మారాలంటే అలవాట్లను మార్చుకోవాలి. పెద్దలు, సన్నిహితులు ఇచ్చే సలహాలు, సూచనలను స్వీకరించాలి. రోజూ వ్యాయామం చేయడం అలవరచుకోవాలి. వ్యాయామం చేస్తే పనిలో నిర్లక్ష్యం, ఆలసత్వం ఉండదు. 
 
నిర్లక్ష్యం, ఆలసత్వాన్ని వదిలేస్తే లక్ష్యాన్ని చేరుకుని సులభంగా విజయం సాధించవచ్చు. అందువల్ల బద్ధకాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. బద్ధకం వల్ల నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరదు. బద్ధకం వల్ల కెరీర్ లో ఎంతో విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. బద్ధకాన్ని వీడి పనిలో పడితే నెమ్మదిగా బద్ధకం తగ్గుతుంది. బద్ధకాన్ని వీడి శ్రమించేవారు ఏ పనిలోనైనా సక్సెస్ సాధించగలరు.  ఎవరైతే శ్రమిస్తారో వారికి మాత్రమే  సక్సెస్ సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: