ప్రతి ఒక్కరూ సక్సెస్ కోసమే ఏ పనినైనా మొదలుపెడతారు. పని మొదలుపెట్టే సమయంలో సక్సెస్ ఎలాగైనా సాధించాలని అనుకుంటారు. కానీ పని మొదలుపెట్టే సమయంలో చూపించిన ఆసక్తి తరువాత చూపించరు. ఎవరైనా పని విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిస్తే మూర్ఖంగా సమాధానం చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్లు జీవితంలో విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 
 
చాలా మంది మూర్ఖత్వం వల్ల ఇతరుల సలహాలను పాటించరు. తమకే అన్నీ తెలుసనే గర్వంతో జీవిస్తూ ఉంటారు. తమ కంటే అనుభవజ్ఞులు, సన్నిహితులు చెప్పిన మాటలను పట్టించుకోరు. తీరా జీవితంలో నష్టపోయాక అవతలి వాళ్ల సలహాలను వినలేదని బాధ పడుతూ ఉంటారు. మూర్ఖత్వం వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఇతరులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. 
 
మూర్ఖత్వం వల్ల చేసే పనుల్లో వ్యతిరేక ఫలితాలే వచ్చే అవకాశాలు ఉంటాయి. జీవితంలో అన్నీ తెలుసనే గర్వం ఎప్పటికీ పనికి రాదు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇతరులు ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే వాటిలో మంచీచెడులను గ్రహించాలి. ఎల్లవేళలా సమయస్పూర్తితో వ్యవహరించాలి. మూర్ఖత్వంతో వ్యవహరిస్తే ఇతరులు మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 
 
అందువల్ల ఏ పనిలోనైనా, నిర్ణయాలలోనైనా మూర్ఖత్వం పనికి రాదు. మూర్ఖులు తాము నష్టపోవడమే కాకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇతరుల ముందు కూడా నవ్వులపాలు అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా నిత్య విద్యార్థిలా ఉంటూ అవతలి వ్యక్తుల ఆలోచనలకు, మాటలకు ప్రాధాన్యతనిస్తూ ముందడుగు వేస్తే విజయం తప్పక సొంతమవుతుంది. అలాంటివారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరే అవకాశం ఉంటుంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: