ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ అనేది ఎంతో కీలకం. ఎవరైతే సక్సెస్ అవుతారో వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే సమయాన్ని వృథా చేస్తారో వారు జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది. చాలామంది ఫెయిల్యూర్ వస్తే సమయం సరిపోలేదని చెబుతూ ఉంటారు. కానీ వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సమయం అందరికీ ఒకేలా ఉంటుంది. వృథా చేసే ప్రతి నిమిషం తిరిగి పొందాలన్నా పొందలేము. 
 
మనలో చాలామంది ముఖ్యమైన పనులు చేయడానికి కూడా సమయం లేదని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉండే ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి. చాలామంది జీవితంలో సక్సెస్ కాకపోవడానికి అసలు కారణం పనులను వాయిదా వేయడం. చాలామంది బద్ధకం, నిర్లక్ష్యం వల్ల పనులను వాయిదా వేస్తూ ఉంటారు. పనులను వాయిదా వేసుకుంటూ పోతే ఆ పనులు వాయిదా పడుతూనే ఉంటాయి. 
 
ఒకే సమయంలో ఎక్కువ పనులు ఉంటే ప్రాధాన్యత ఆధారంగా పనులను పూర్తి చేయాలి. కొన్ని సందర్భాల్లో గడియారంతో పోటీ పడి పరిగెడితే మాత్రమే విజయం సొంతమవుతుంది. సరైన సమయానికి పనులను పూర్తి చేయలేకపోతే తరువాత ఆ పనులను చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. మన లక్ష్యాలకు సంబంధించిన పనులపై సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. జీవితంలో ఎలాంటి ఫలితాలు కావాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. 
 
మరికొంతమంది పర్ఫెక్షన్ పేరుతో అన్ని పనులు వారే చెయ్యాలని అనుకుంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన పనిని తేలిక చేసే కొంత పనిని ఇతరులకు అప్పగించడం ద్వారా సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. మన పనిని ఇతరులకు అప్పగించడం వల్ల సమయానికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. ఒక వ్యక్తి సమయాన్ని ఎలా వినియోగించుకున్నాడు అనేదే అతని జీవిత విజయానికి నిజమైన అర్థం. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: