జీవితంలో చాలామంది విజయం సాధించే సత్తా ఉన్నా కొన్ని కారణాల వల్ల కెరీర్ లో సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. చాలామంది చెడు స్నేహాల వల్ల కెరీర్ ను నాశనం చేసుకుంటూ ఉంటారు. సమాజంలో చాలామంది చెడు స్నేహాల వల్ల చెడు అలవాట్ల భారీన పడుతున్నారు. చెడు స్నేహాలు మొదట్లో బాగానే అనిపించినా ఆ స్నేహాల వల్ల నష్టం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మన మంచిని కోరుకుంటారు. 
 
చెడు స్నేహాలు కొన్నిసార్లు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది. స్నేహం విలువ తెలిసి మిత్రత్వ ధర్మం పాటించే స్నేహితులను మాత్రమే ఎంచుకోవాలి. బాల్యం నుంచే స్నేహితుల ఎంపికలో జాగ్రత్త వహించాలి. స్నేహం ఎప్పుడు ఏర్పడినా అందులో నిజాయతీ ముఖ్యం. స్నేహంలో నిజాయితీ లేకపోతే అది అపాత్రదానంలా మారుతుంది. స్నేహాన్ని జాగ్రత్తగా చూసుకోవడమనేది ఇద్దరు స్నేహితులపై ఆధారపడి ఉంటుంది. 
 
మంచి, చెడు విచక్షణను ఎప్పటికప్పుడు మనస్సుకు తెలిపేవారు నిజమైన స్నేహితులు. విధేయత, విశ్వసనీయత, సహాయత లాంటి లక్షణాలు నిజమైన స్నేహంలో ఉంటాయి. ఈ లక్షణాలు లేకపోతే ఆ స్నేహానికి విలువ ఉండదు. విలువలతో కూడిన స్నేహం వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుంది. మన జీవిత ప్రయాణంలో ఒక మంచి స్నేహితుడు తోడుంటే ఆ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. 
 
నేటి యువత ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పుకోలేని సమస్యలను సైతం స్నేహితులతో చెప్పుకుంటుంది. చెడు స్నేహం వల్ల దుష్పలితాలు కలిగే అవకాశాలు ఎక్కువ. "వివేకంగల శత్రువుకంటే వివేకశూన్యుడైన స్నేహితుడే ఎక్కువ ప్రమాదకరం" అనే మాట పెద్దలు ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు. ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే ఆ స్నేహాన్ని నిలుపుకోవడం మాత్రం సులభం కాదు. చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ మంచి స్నేహాలకు ఆహ్వానం పలకడం ద్వారా ఏ పనిలోనైనా విజయం సొంతం చేసుకోవచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి: