ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి రంగంలో విపరీతంగా పోటీ పెరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. వ్యాపారాల్లో ఎప్పుడు లాభాలు వస్తాయో ఎప్పుడు నష్టాలు వస్తాయో తెలీని పరిస్థితి నెలకొంది. ఇలా మన చుట్టూ అవకాశాలు లేవని బాధ పడేవారు ఎంతోమంది ఉంటారు. గతంలో ఇంత పోటీ లేదని... ప్రస్తుతం ఎంత కష్టపడినా అవకాశాలు లభించడం లేదని చెబుతూ ఉంటారు. 
 
కానీ ప్రస్తుత ప్రపంచంలో పోటీ పెరిగినా అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. సాహసవంతులు, ధైర్యవంతులకు ఆ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. రాబోయే అవకాశాలకు అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అవకాశం ఏ రోజు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. మనం చేయాల్సిందల్లా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉండడమే. 
 
మనకు అవకాశాలు రావాలంటే మొదట మనల్ని మనం మార్చుకోవాలి. మూడు విధాలుగా అవకాశాలను సృష్టించుకోవచ్చు. మొదట స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకుని నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ బలహీనతలను గుర్తించాలి. ఆ బలహీనతలు అవకాశాలను దూరం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులు, బంధువుల ద్వారా కొత్త అవకాశాల కోసం ప్రయత్నించాలి. 
 
కొన్ని సందర్భాల్లో తెలిసిన వారి ద్వారా మాత్రమే అవకాశాలు వస్తాయి. తెలిసిన వారు తక్కువ సమయంలోనే మనకు మంచి అవకాశాలను కల్పించే ఛాన్స్ ఉంది. ఎవరైతే నిత్య విద్యార్థిలా ఉంటారో వారు సులభంగా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. లక్ష్యం కోసం అవసరమైన పనులు చేయడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలా చేస్తూ వెళితే కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అవకాశాల కోసం ఆ రంగంలో అనుభవం ఉన్నవారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇతరులు ఇచ్చిన సలహాలు, సూచనలు అవకాశాల కోసం ఎంతవరకు ఉపయోగపడతాయో ఆలోచించాలి. నైపుణ్యాలను మెరుగుపరచుకుని అవకాశాల కోసం ప్రయత్నిస్తే సులభంగా విజయం సొంతమవుతుంది.     


 

మరింత సమాచారం తెలుసుకోండి: