ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం సక్సెస్ కోసం ఎంతో ప్రయత్నిస్తారు. కొందరు సులువుగా ఆ సక్సెస్ ను సాధిస్తే మరికొందరు సక్సెస్ కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ సక్సెస్ లోను ఫెయిల్యూర్ లోను మనపై మన స్నేహితుల ప్రభావం చాలా ఉంటుంది. మన స్నేహితుల ప్రభావం ఎల్లప్పుడూ మన ఆలోచనలపై ఉంటుంది. స్నేహితుల్లో రెండు రకాలు ఉంటారు. వారిలో నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మన సక్సెస్ కోసం తమ వంతు సహాయం చేస్తారు. 
 
మరో రకం స్నేహితులు మాత్రం వారు చెడిపోతూ మనల్నికూడా చెడు అలవాట్ల భారీన పడేలా చేశారు. నిజమైన స్నేహితులు మనం జీవితంలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఒకే విధంగా ఉంటారు. నిజమైన స్నేహితులు మన సక్సెస్ కు కావాల్సిన సహాయసహకరాలు అందిస్తూ ఎల్లవేళలా మన సక్సెస్ లో పాలు పాంచుకుంటారు. కష్టం, నష్టం, బాధ, సుఖంలో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ గెలుపు కోసం ప్రోత్సహిస్తూ ఉంటారు. 
 
నిజమైన స్నేహితులను కలిగి ఉండటంతో పాటు చేసే ప్రతి పనిలోనూ ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు సులభంగా విజయం సాధిస్తారు. ఎవరైతే సమయాన్ని వృథా చేస్తారో వారు సక్సెస్ సాధించడం అంత సులువు కాదు. జీవితంలో సక్సెస్ అయిన వారికి సక్సెస్ కాని వారికి మధ్య ఖచ్చితంగా కొన్ని తేడాలు ఉంటాయి. ఆ తేడాలే చాలా సందర్భాల్లో కొందరు విజయం సాధించడానికి... మరికొందరు ఓటమిపాలు కావడానికి కారణమవుతాయి. 
 
మనం ఎంచుకునే స్నేహితుల పైనే జీవితంలో చాలా విషయాలు ఆధారపడుతూ ఉంటాయి. మన స్నేహితులు, వారి అలవాట్లు ప్రత్యక్షంగా ప్రభావం చూపకపోయినా పరోక్షంగా మన జీవితంలోని చాలా విషయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందువల్ల స్నేహితులను ఎంచుకునే విషయంలో మనం జాగ్రత్త వహించాలి. సమాజంలో ఎంతో మంది ఉన్నా నిజమైన స్నేహితులు మాత్రమే మనకు కష్ట కాలంలో తోడుగా నిలబడతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: