ప్రతి మనిషి విజయం సాధించాలని కలలు కంటాడు. కానీ అందరికీ విజయం సిద్దిస్తుందా అంటే మాత్రం కాదనే చెప్పాలి. వరుస ఓటములను ఎదుర్కొన్నవారు విజయం పేరు వింటేనే భయాందోళనకు గురవుతూ ఉంటారు. చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ విజయం సాధించాలంటే ఏం చేయాలనే ప్రశ్న అందరినీ తరచూ వేధిస్తూ ఉంటుంది. ఉద్యోగాల కోసం రోజులో 20 గంటలు శ్రమించేవారు ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
సులభంగా విజయం సాధించడం సాధ్యం కాకపోవచ్చు కానీ విజయం సాధించడం అసాధ్యం మాత్రం కాదు. మనోసిద్ధితో శ్రమిస్తే విజయం సులభంగా సొంతమవుతుంది. మొదట విజయం సాధించగలమని మనల్ని మనం నమ్మాలి. మనస్సులో అనుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుందని నమ్మకం ఎల్లప్పుడూ ఉండాలి. విజయసాధనలో లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం ప్రధానమైనది. ఎల్లప్పుడూ విజయం సాధించగలమనే సంకల్పం మనలో ఉండాలి. 
 
అపజయంలో ఎదుర్కొన్న అంశాలను అవగాహన చేసుకుంటూ ముందడుగులు వేయాలి. విజయం సిద్ధించేవరకు వెనకడుగు వేయకూడదు. విజయం సాధించటానికి ప్రయత్నించే క్రమంలో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను చూసి భయపడి పిరికివాడిలా వెనుకడుగు వేస్తే విజయం ఎప్పటికీ సొంతం కాదు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ మన పని మనం చేస్తూ ఉండాలి. 
 
చాలా మంది మొదట్లోనే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందా....? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. గతంలోని ఓటములు, వైఫల్యాలు వారి మనసును భయపెడుతూ ఉంటాయి. ప్రతి ఓటమిలో, ప్రతి వైఫల్యం వెనుక దాగివున్న రహస్యాలను అవగాహన చేసుకోవాలి. అలా చేస్తే మనలోని సామర్థ్యాలు మెరుగుపడటంతో పాటు ఎదిగే అవకాశం ఉంటుంది. ఏ పనినైనా విజయం సాధించడానికి నిర్దిష్ట సమయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎన్ని  అపజయాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకుండా మనోసిద్ధితో కష్టపడితే విజయం సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: