ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే శ్రమ, ప్రతిభ రెండూ ముఖ్యం. శ్రమ లేకుండా ప్రతిభ ఉన్నా ప్రతిభ లేకుండా శ్రమ ఉన్నా వ్యర్థమే. రెండు లక్షణాలు మనలో ఉంటే మాత్రమే విజయం సొంతమవుతుంది. ప్రతిభకు శ్రమ తోడైతే ఆకాశాన్నైనా అందుకోవడం సాధ్యమవుతుంది. కన్న కలలను ఆత్మసంతృప్తినిచ్చే హోదాను అందుకోవాలంటే శ్రమించాలి. ఆశనిరాశల మధ్య ఊగిసలాడే జీవితాల్లో సుధీర్ఘకాలం శ్రమ ద్వారా మాత్రమే అద్భుతమైన విజయాలు సొంతమవుతాయి. 
 
ఏ పనిలోనైనా ఆటంకాలకు ఎదురు నిలిస్తే గెలుపు సొంతమవుతుంది. అలా కాకుండా చేసే పనిలో ఓటమిపాలవుతామని భావించి మధ్యలోనే వదిలేస్తే మాత్రం పరాజయం పలకరిస్తుంది. కొంతమంది ఎంత శ్రమించినా తొలి ప్రయత్నంలో విజయం సొంతం కాదు. తొలి ప్రయత్నంలో ఓటమిపాలైతే నిరాశానిస్పృహలకు లోను కాకుండా మరోసారి ప్రయత్నించాలి. ఎందువల్ల మనం ఓటమిపాలయ్యామో గుర్తించాలి. 
 
గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ... లోటుపాట్లు ఎక్కడ జరిగాయో తెలుసుకుని సవరించుకోవాలి. కసితో తొలుత ఫెయిల్యూర్ వచ్చినా స్వీకరించే సామర్థ్యం మనలో ఉండాలి. ఒకే పరీక్ష కోసం కష్టపడే స్నేహితులుంటే గ్రూప్ స్టడీస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. చదివే విషయాలను నోట్స్ ప్రిపేర్ చేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఎక్కువ చదవాలన్న ఆరాటంతో సగం సగం చదివినా ఉపయోగం ఉండదు. 
 
రోజులో గంటల తరబడి చదవకుండా మధ్యలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. నిరంతరం శ్రమిస్తేనే విజయం సొంతమవుతుందని గుర్తుంచుకోవాలి. ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా శ్రమిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. ప్రణాళికాబద్ధంగా ప్రతిభతో ప్రయత్నిస్తే విజయం సాధించడం సాధ్యమవుతుంది. సరైన ప్రణాళికతో సిలబస్ ను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ లక్ష్య సాధన కోసం ప్రయత్నించాలి. నేర్చుకున్న వాటిని రివిజన్ చేసుకుంటూ కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా కష్టపడితే ఏ పనిలోనైనా విజయం సులభంగా సొంతమవుతుంది.        

మరింత సమాచారం తెలుసుకోండి: