దాదాపు మూడు సంవత్సరాలుగా తెలుగు పరిశ్రమలో ఎదురులేని కుర్ర హీరో గా దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ నిజ జీవితంలో ప్రజలకు అండగా ఉండటం లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. మిగతా స్టార్ హీరోల్లాగా ఎంతోకొంత డబ్బులు చిరంజీవి నేతృత్వంలో ఏర్పడిన సీసీసీకి విరాళం ఇచ్చి చేతులు దులుపుకోవాలని విజయ్ దేవరకొండ అనుకోలేదు. అవసరంలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు తనవంతుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సాయం నేరుగా అందేలా తాను మిడిల్ క్లాస్ పౌండేషన్ స్థాపించి వాలంటీర్లను తీసుకొని పక్కా ప్రణాళికతో ముందడుగు వేశాడు. 

IHG
25 లక్షల రూపాయలతో స్థాపించబడిన మిడిల్ క్లాస్ ఫౌండేషన్ కు 8, 515 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రూ. 1కోటి 51 లక్షల వరకు విరాళాలు అందజేశారు. ఐతే ఆ డబ్బులను బాగా అవసరం లో ఉన్న, 17 వేల 723 మధ్య తరగతి కుటుంబాలకు విజయ్ దానం చేశాడు. నిజానికి ఈ విపత్కర పరిస్థితులలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం పైసా కూడా ఇవ్వని సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. వారందరితో పోల్చి చూస్తే... విజయ్ దేవరకొండ ఎంతో గొప్ప మనసున్న వాడు అని అర్థమవుతుంది. 

IHG
ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వగా... తన మిడిల్ క్లాస్ ఫండ్ ని విజయ్ ఆపి వేసాడు. తన భాషలో చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫండ్ ని రెస్ట్ మోడ్ లో ఉంచాడు. దీన్నిబట్టి లాక్ డౌన్ ఎత్తి వేస్తున్నారు కాబట్టి మధ్యతరగతి ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ఇక తమ సంపాదన తాము సంపాదించుకొని జీవనాన్ని సాగిస్తారని విజయ్ భావించినట్లు తెలుస్తోంది. కానీ లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం మధ్యతరగతి ప్రజల జీవితాలు చక్కబడతాయి అనుకోవడం పొరపాటే. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ చేసిన సాయం ప్రశంసనీయం కానీ తన ఏంసీఎఫ్ ని రెస్ట్ మోడ్ లో పెట్టకుండా దాన్ని యధావిధిగా కొనసాగించాల్సింది. 

IHG
తమకి కూడా ఆర్థిక సాయం చేయాలంటూ విజయ్ దేవరకొండ ఫండ్ లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి ఇప్పటికి వస్తున్నాయి కూడా. కానీ విరాళాలు ఇచ్చేవారు మాత్రం గణనీయంగా తగ్గిపోయారు. అందుకే ఈ రౌడీ బాయ్ ఏంసీఎఫ్ నిలిపివేశాడు అని భావించవచ్చు. కొంతమంది మాత్రం విజయ్ తను ఏర్పాటుచేసిన మిడిల్ క్లాస్ ఫండ్ ని యాక్టివ్ గా ఉంచుతూ... పదిమంది మధ్యతరగతి ప్రజల కైనా సహాయం చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా తమ పాపులారిటీని గురించి పట్టించుకున్న అంతగా ప్రజల గురించి పట్టించుకోని సెలబ్రిటీల కంటే మొన్నీమధ్య తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ ఎంతో బెటర్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: