సక్సెస్ ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్వచిస్తూ ఉంటారు. కొందరు ఆర్థికంగా ఎదగటాన్ని మాత్రమే సక్సెస్ అనుకుంటే మరికొందరు తాము సక్సెస్ అవుతూ నలుగురి ఎదుగుదలలోనే సక్సెస్ ను చూసుకుంటూ ఉంటారు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడమే నిజమైన సక్సెస్ గా భావిస్తూ ఉంటారు. మరి సక్సెస్ సాధించడం ఎలా...? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. నిజానికి సక్సెస్ సాధించటానికి ఎటువంటి సీక్రెట్లు ఉండవు. 
 
ఎవరైతే కష్టపడతారో వారికి మాత్రమే సక్సెస్ దక్కుతుంది. సక్సెస్ కు సంబంధించిన సూత్రాలను ఎవరూ అమ్మరు, అమ్మలేరు. ఎందుకంటే అలాంటి సూత్రాలు ఉండవు. కానీ కొన్ని లక్షణాలను అలవరచుకోవడం ద్వారా సక్సెస్ సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి లక్షణాలలో సమయోచిత బుద్ధి ఒకటి. సక్సెస్ కోసం ప్రయత్నించే సమయంలో ప్రతి ఒక్కరికీ ఆపదలు, అడ్డంకులు ఎదురవుతాయి. 
 
ఈ పరిస్థితులను ఎదుర్కోవాలంటే సమయోచిత బుద్ధి చాలా ముఖ్యం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మాత్రమే జీవితంలో ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆందోళన స్థితిలో పనులు చేయాలని ప్రయత్నించినా, ఉద్రేకమైన నిర్ణయాలు తీసుకున్న వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న నిర్ణయాలే మన భవిష్యత్తును శాసిస్తాయి. 
 
సమయోచిత బుద్ధి జీవితంలో ముందడుగులు వేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సమస్యలు వచ్చిన సమయంలో సందర్భానుసారం సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడుతుంది. సమయోచిత బుద్ధితో పాటు పట్టుదల, సరైన గమ్యస్థానం, శ్రమలాంటి లక్షణాలు జీవితంలో ఎదగటానికి చాలా ముఖ్యం. ఈ లక్షణాలు కలిగి ఉన్నవారు త్వరగా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుంది. సమయోచిత బుద్ధి జీవితంలో ఎలాంటి సందర్భంలోనైనా మనల్ని సరైన నిర్ణయం తీసుకునేలా చేసి మన ఎదుగుదలకు సహాయపడుతుంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: