స‌రిప‌ల్లి కోటిరెడ్డి. టెక్ దిగ్గ‌జంగా  త‌నంత‌ట తాను ఏర్పాటు చేసుకున్న సోపానాల‌పై ఆయ‌న ఎదిగిన తీరు న‌భూతో.. న‌భ‌విష్య‌తి!  ఎక్క‌డి గుడివాడ‌.. ఎక్క‌డి అమెరికా.. ఎవ‌రూ ఊహించ‌ని ఓ చిన్న గ్రామం నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగిన కోటిరెడ్డి.. ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా తాను స్థాపించిన  కంపెనీల ద్వారా.. త‌ను ఏర్పాటు చేసుకున్న క‌లల ప్రపంచం ద్వారా కోట్లాది మందికి సేవ‌లు అందిస్తున్నారు. తాను సంపాయించిన సొమ్ములో 33 శాతం నిధుల‌ను సమాజ సేవ‌కే వినియోగిస్తున్నారు. నిజానికి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇలాఅంద‌రూ చేస్తున్నదే క‌దా? అనే చిన్న‌పాటి విమ‌ర్శ‌లు రావొచ్చు.

 

కానీ, అంద‌రిలా తానుంటే.,. ఇప్పుడు కోటిరెడ్డి వార్త‌ల్లో వ్య‌క్తిగా మారి ఉండేవారు కాదు. ఆయ‌న వ్యూహం ఎంత ప‌దునో.. ఆయ‌న ఆలోచ‌న‌,ఆయ‌న మ‌న‌సు అంతే మెత్త‌న‌! బాధ్య‌త అంటే డ‌బ్బులు ఇచ్చి వ‌దిలేయ ‌డం కాదు.. బాధ్య‌త అంటే.. అంతా తానై వ్య‌వ‌హ‌రించ‌డం, అన్ని రూపాల్లోనూ త‌న ప్ర‌తిబింబం క‌నిపించ ‌డం.. ఇదే ఆయ‌న‌ను స‌మాజంలో ఒక ప్ర‌ముఖ వ్య‌క్తిగా నిల‌బెట్టింది. ఎంత ఎదిగామా అన్న‌ది కాదు.. ఎంత ‌గా ఒదిగి ఉన్నామా? అనే సూత్రాన్ని ఆసాంతం ఒంట‌బ‌ట్టించుకున్నారు కోటిరెడ్డి. మ‌ట్టివాస‌న తెలియ‌డ మే కాదు.. మ‌ట్టి మ‌నిషిగా మ‌న‌సు తెలుసుకుని స‌మాజ‌హితాన్ని అభిల‌షించే వ్య‌క్తిత్వం ఉన్న టెకీగా ఆయ‌న గుర్తింపు పొందారు.

 

ప‌రోకారార్థ‌మిదం శ‌రీరం అన్న ఆర్యోక్తుల‌ను నిజం చేయ‌డంలో కోటిరెడ్డికి మ‌రెవ‌రూ సాటిరారు. త‌న కోసం తాను జీవిస్తే.. పెద్ద‌గా చెప్ప‌డానికి ఏముంటుంది?  కానీ, తాను జీవిస్తూ.. స‌మాజాన్ని జీవింప‌జేస్తున్న వారు ఎవ‌రైనా ఉంటే.. వారి గురించి చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి వారిలో కోటిరెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటారు. నేటి స‌మాజానికి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉన్న ప్ర‌జారోగ్యంపై ఆయ‌న `హైఫై ఇండెక్స్` పేరుతో చేస్తున్న ప‌రిశో ధన‌లు నూతన స‌మాజావిష్క‌ర‌ణ దిశ‌గా అడుగులు వేయిస్తోంది. శ‌రీరంలోని ప్ర‌తి అవ‌య‌వాన్నీ సంపూ ర్ణంగా అధ్య‌య‌నం చేయ‌డ‌మే ఈ ప్రాజెక్టు ప్ర‌ధాన ఉద్దేశం. దీనిని అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ప్ర‌జ‌ల‌కు అం దించాల‌నేది కోటిరెడ్డి స‌త్సంక‌ల్పం.

 

అదే స‌మ‌యంలో `పినాకిల్ బూమ్స్` ద్వారా చిన్నారుల‌కు అందిస్తున్న సేవ మ‌రో కోణం. బుద్ధి మాంద్యం తో ఇబ్బంది ప‌డే చిన్నారుల‌కు ఒకప్పుడు స‌రైన చికిత్స అందుబాటులో ఉండేది కాదు. అంతేకాదు, ప‌లు ర‌కాల ట్రీట్‌మెంట్ల‌కు ప‌లు ప్రాంతాల‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. ఈ ప‌రిస్థితిలో అల్లాడుతున్న వారికి ఆద‌ర్శంగా మారారు కోటిరెడ్డి దంప‌తులు. హైద‌రాబాద్‌లోనే పినాకిల్ బూమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్క‌డ అన్ని ర‌కా ల చికిత్స‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు ఈసుకువ‌చ్చారు. అంతేకాదు, అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు వాటిని చేరువ చేశారు. అయితే.. ఇంత చేస్తున్నా.. గ‌ర్వం పొడ‌సూప‌ని అత్యంత నిగ‌ర్వి.. నిరాడంబ‌రుడు స‌రిప‌ల్లి!  ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి, టాటా, అజీమ్ ‌ప్రేమ్‌జీల వంటి దిగ్గ‌జాలను ఆద‌ర్శ‌కంగా తీసుకుని దూసుకు వెళుతోన్న‌ కోటిరెడ్డి భ‌విష్య‌త్తులో మ‌రెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: