కోటి రెడ్డి సరిపల్లి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సాధించిన ఘనతలను గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు చెప్పి ఉంటారు కానీ ఆయన తన జీవితంగా భావించే సమాజం మరియు తనను నమ్మి ఎల్లకాలం వెంట ఉండే తన వసుధైక కుటుంబానికి ఇస్తున్న స్ఫూర్తి మరియు ఉదాహరణగా నిలిచిన సందర్భాల గురించి కొంత మందికే తెలుసు. అతని సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి నేనున్నాననే భరోసా.... నువ్వు చేయగలవు అన్న విశ్వాసం…. మరియు నీకు తెలియకుండానే అతని విధి విధానాలతో నిన్ను అందరికన్నా అత్యుత్తమంగా తయారుచేసే అతని నేర్పు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 

కోటి రెడ్డి గారు శ్రమను నమ్మే వ్యక్తి. కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది అని చెబుతూనే ఆ పనిని ఎంత వినూత్నంగా చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎంత గొప్పగా ఉంటుందో అందరికీ చేసి చూపించిన నేర్పరి. మనలో ఆత్మవిశ్వాసం ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా అవలీలగా వాటిని దాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్లిపోతాం అని మనకు చూపిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 750 రూపాయల తో మొదలు పెట్టి ఇప్పుడు 750 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలను స్థాపించిన ఈ మనిషి యొక్క జీవితమే ఒక పాఠం.

 

గ్రాడ్యుయేషన్ లేకుండా మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సంపాదించిన తీరు మరియు తన బాధ్యతలను చిన్నతనంలో గుర్తించి ఆ తర్వాత సమాజ శ్రేయస్సును అందులో భాగంగా చేసుకుని ఎప్పటికప్పుడు తన తోటివారికి ఉపాధిని కల్పిస్తూ వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేటట్లు వారిని నడిపిస్తూ మరియు ఎంతో మందిని తన ఉదార హృదయంతో అక్కున చేర్చుకున్న ఈయన గురించి చెప్పడానికి మాటలు చాలవు అంటే అతిశయోక్తి కాదు. ఏడు సంవత్సరాలు గా ఆయనతో నడుస్తున్నాను. జర్నలిస్ట్ గా ఓనమాలు దిద్దాడానికి అనేక సంస్థలతో పాటు ఫ్రీ లాన్స్ రైటర్ గా అవకాశం ఇచ్చిన APH సంస్థ ఈ రోజు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మారే మంచి అవకాశం ఇచ్చింది అంటే దానికి కోటిగారు వేసిన బంగారు పునాది కారణం. 

 

చిన్నప్పుడు మనకి పాఠాలు నేర్పింస్తే అతనిని అతనిని ఉపాధ్యాయుడు అంటాం. చిన్నప్పటి నుంచే తన జీవితాన్ని ఒక పాఠంగా మలచుకుని ఎల్లవేళల మనకి నీతిని బోధిస్తే అతనిని కోటిరెడ్డి సరిపల్లి అంటాం. అలాంటి అతను తన పేరుకు తగ్గట్టే లెక్కకు మిక్కిలిగా పుట్టిన రోజులు జరుపుకోవాలి అని హృదయపూర్వకంగా ఆశిస్తూ…. అనుదినం మీ పాఠం కై వేచి ఉండే వందల మంది శిష్యుల్లో ఒకడు.

మరింత సమాచారం తెలుసుకోండి: