ఓటమి విజయానికి పునాది. జీవితంలో ఓడిపోయిన సమయంలోనే మనకు జీవితం యొక్క విలువ తెలుస్తుంది. ఓటమి తరువాత నిరాశానిస్పృహలకు లోను కాకుండా విజయం కోసం ప్రయత్నిస్తే సక్సెస్ తప్పక సొంతమవుతుంది. ఎవరైతే జీవితంలో ఓడిపోతారో వాళ్లే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోగలరు. జీవితంలో కొన్నిసార్లు వరుస విజయాలు సాధించిన వాళ్లు సైతం ఒకటి రెండుసార్లు ఓటమిపాలైతే ఇతరులు విమర్శలు చేస్తూ ఉంటారు. 
 
ఓటమిపాలైన వారికి భవిష్యత్తు లేదనే స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఓటమిపాలైన సందర్భంలో మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అకడమిక్‌ పరీక్షల్లో విఫలమైన ఎంతో మంది సక్సెస్ సాధించి నేడు సమాజం ముందు రోల్ మోడల్స్ గా నిలిచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌, బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ జీవితంలో ఎన్నో ఓటములను చవిచూసి చివరకు సక్సెస్ సాధించారు. 
 
బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ సైతం ఎన్నో ఓటముల తర్వాత సక్సెస్ సాధించారు. నేడు గొప్ప డాక్టర్లుగా హైదరాబాద్‌లో మన ముందు నిలబడిన కొంతమంది మెడిసిన్‌లో ఫెయిల్‌ అయ్యి తర్వాత సక్సెస్ సాధించారు. జీవితంలో ఏదైనా పనిలో ఫెయిల్ అయితే ఇంకొద్దిగా కష్టపడితే సక్సెస్ తప్పక సొంతమవుతుంది. మనలో ఆత్మ విశ్వాసం ఉంటే ఎలాంటి ప్రయత్నంలోనైనా విజయం సొంతమవుతుంది. 
 
ఫెయిలైతే పరాజితుడు కాడు. ఫెయిల్‌ అవడం తప్పూ కాదు. అయితే ఫెయిలైన తర్వాత వచ్చిన విరామాన్ని ఎంత నాణ్యంగా గడిపామన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో సరైన అడుగులు వేయలేకపోతే మాత్రం నిజంగా విఫలమైనట్లు భావించాలి. విరామం వరం లాంటిది. లోపాలు సవరించుకోవడం, పట్టుదలతో చదవడం, పరీక్ష పాసవడం ఒక పద్ధతి. నచ్చిన వ్యాపకంలోని అడుగుపెట్టి పైకి రావడం మరో పద్ధతి. ఒక ఓటమి, మరో భారీ విజయానికి నాంది కావాలని అనుకొని కష్టపడితే విజయం తప్పక సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: