జీవితంలో మనం ఎంత కష్టపడినా సక్సెస్ సాధించకపోకపోతే ఆ శ్రమ వ్యర్థం. సక్సెస్ సాధిస్తే మాత్రమే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కానీ చాలామందికి వారిలో ఉండే భయమే సక్సెస్ ను దూరం చేస్తుంది. ప్రతి మనిషి విజయం సాధించాలనే ఆలోచిస్తాడు. కానీ భయం వల్ల విజయం అనే పదాన్ని గంభీరంగా ఉచ్చరించగానే ఒళ్లు గగుర్పొడుస్తోంది. వంద ఉద్యోగాల కోసం వేల మంది పోటీ పడుతున్న కాలంలో అందరికీ విజయం సొంతం కాదు. 
 
కానీ కష్టపడితే మాత్రం విజయం సొంతం చేసుకోవడం అసాధ్యం కాదు. శ్రమించకుండా లభించడానికి విజయం మార్కెట్‌లో దొరికే వస్తువు కాదు. కఠోర దీక్ష, పట్టుదల వుంటే ఏదైనా సరే మన సొంతం చేసుకోవచ్చు. ఏ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామో ఆ లక్ష్యంపై ఎల్లప్పుడూ దృష్టి కేంద్రీకరించడం విజయసాధనలో ప్రధానమైనది. లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు, అపజయాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. 
 
అంత మాత్రాన కృంగిపోకుండా ఓటమి నుండి కూడా విజయం సాధించడానికి కావలసిన మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి. అపజయంలో ఎదుర్కొన్న అంశాలను అవగాహన చేసుకుంటూ లక్ష్యం దిశగా ముందడుగులు వేయాలి. ఎల్లప్పుడూ విజయాన్ని సాధించాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండటంతో పాటు మనసులో బలంగా నిర్ణయించుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సాధ్యమైనంత మేరకు విజయం కోసం కష్టపడాలి. 
 
చాలా మందిలో ఇంత కష్టమైన పనిని నేను సాధిస్తానా అనే భయం మనసులో వెంటాడుతూ వారిని విజయానికి దూరం చేస్తుంది. ప్రతి ఓటమిలో, ప్రతి వైఫల్యం వెనక దాగి ఉన్న రహస్యాలను అవగాహన చేసుకోగలిగితే మనలో దాగి ఉన్న సామర్థ్యాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. ఆత్మ విశ్వాసం, పట్టుదలతో భయాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. ఓటమికి భయపడకుండా ఓటమితో విజయానికి మెట్లను ఏర్పరుచుకోగలిగే స్థాయికి ఎదగాలి.           

మరింత సమాచారం తెలుసుకోండి: