మనలో చాలామంది సమస్యలు ఎదురైన సమయంలో తమకు మాత్రమే ఇలాంటి కష్టాలు వస్తున్నాయని భావిస్తూ ఉంటారు. కొందరు ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మరికొందరు మాత్రం నిరాశానిస్పృహలకు లోనై బాధ పడుతూ ఉంటారు. నిజానికి అనుకోని చిక్కులు ఎదురైనపుడే మనలోని అంతర్గత శక్తులు బయటపడతాయి. ఆ శక్తులను వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి వినియోగిస్తే మన కెరీర్ కు ఢోకా ఉండదు. 
 
కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భవితను మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలంటే మంచి విద్యార్హతలూ, సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే ఉంటే సరిపోదు. సమస్య పరిష్కారంలో ముందుండటం, ఇతరులతో సవ్యంగా మెలగటం కూడా అలవాటు చేసుకోవాలి. జీవన నైపుణ్యాలు ఇందుకోసం మనకు ఎంతగానో సహాయపడతాయి. 
 
అనూహ్యమైన పరిస్థితులు వచ్చినపుడు నిర్దేశించుకున్న ప్రణాళికలు అన్నీ మారిపోవడం సాధారణంగా జరిగేదే. అంత మాత్రాన మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు. గడుస్తున్న రోజులు భారంగానూ, సుదీర్ఘంగానూ గడుస్తున్నాయంటే మనం సమయాన్ని వృథా చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఆశావహ దృక్పథంతో ముందడుగులు వేయాలి. ఆశావహ దృక్పథం అలవరచుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. 
 
మనం జీవితంలో మార్పులను స్వీకరించే గుణాన్ని కలిగి ఉండాలి. నిరాశను ఎదుర్కోగలిగే లక్షణాలను అలవరచుకోవాలి. ఫ్రాధాన్యత ఇచ్చే స్నేహితులతో సన్నిహితంగా మెలగాలి. ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడటం అలవరచుకోవాలి. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆటంకాలు ఎదురైనా ఆశావహ దృక్పథంతో ముందడుగులు వేస్తే సక్సెస్ ను అతి సులువుగా సొంతం చేసుకోవచ్చు. మనం చెప్పదలచుకున్న ఏ విషయాన్నైనా సూటిగా చెప్పాలి. మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇతరుల సహాయం తీసుకోవడంలో తప్పు లేదు. ఆశావహ దృక్పథంతో ఈ విధంగా ప్రయత్నం చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: