ఏదైనా మంచి పనిని మొదలుపెట్టాలంటే ప్రత్యేకమైన పరిస్థితుల కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సాధారణ పరిస్థితుల్లోనే అందుకోసం ప్రయత్నించాలి. అలా కాకుండా తక్కువ కష్టం పడి ఎక్కువ ఫలితం కోసం ఆశిస్తే మాత్రం నిరాశ మిగులుతుంది. అందువల్ల మన జీవితాన్ని మనం శాసించడం నేర్చుకోవాలి. మనకు ఉన్న తెలివి, జ్ఞానం మనకు ఉపయోగపడలేదంటే అది మన తప్పే అవుతుంది. 
 
జీవితంలో మనం ఎన్నో సూత్రాలు పాటిస్తే మాత్రమే విజయం తప్పక సొంతమవుతుంది. విజయం సాధించటానికి మొదట మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. లక్ష్యాన్ని మరచిపోకపోవడమే విజయానికి ఎంతో ముఖ్యం. జీవితంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ముందడుగులు వేస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. సక్సెస్ సాధించాలంటే మొదట మనం మార్పును ఆహ్వానించగలగాలి. 
 
ఆశయ శుద్ధిలేని జీవితం చుక్కాని లేని నావలాంటిదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. లక్ష్యం గొప్పదైతే విజయం ఆటోమేటిక్ గా సొంతమవుతుంది. మనస్సును ఎంత అదుపులో పెడితే మనిషి అంత గొప్పవాడవుతాడని గుర్తుంచుకోవాలి. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషికి చివరకు ఏమీ మిగలదు. త్రికరణ శుద్ధితో శ్రమిస్తే అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. 
 
మన తప్పులను మనం సరిదిద్దుకోవడానికి నిత్య జీవితంలో బోలెడు అవకాశాలు వస్తూ ఉంటాయి. ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం కోసం చివరి నిమిషం వరకు కష్టపడితే కెరీర్ లో అద్భుతమైన విజయం సొంతమవుతుంది. మనం ఆలోచనలోనే కాదు,ఆచరణలో కూడా ఉన్నతంగా ఉండాలి. పరిస్థితులను మార్చుకుని అవకాశాలను సృష్టించుకోగలిగితే జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగడం ఖాయం. ఫలితాన్ని ఆశిస్తూ పరుగెత్తకూడదు. పనిచేస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. మనిషి మనసులో వినయం ఎంతగా ఎదిగితే, ఆ మనిషి జీవితంలో అంత ఎదిగే అవకాశం ఉంటుంది.                          

మరింత సమాచారం తెలుసుకోండి: