దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలోని అన్ని రంగాలపై వైరస్ ప్రభావం పడింది. దేశంలో ప్రజలు వైరస్ వ్యాప్తి వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ భద్రత లేని ఈ సమయంలో కొత్తగా కెరీర్‌ ను నిర్మించుకోవడం చాలా మంది ఉద్యోగులకు సవాలుగా మారింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పకడ్బందీగా కెరీర్ ప్రణాళికను సిద్ధం చేసుకుకోవడం చాలా ముఖ్యం. 
 
ఆపదలు, అవరోధాలు కొత్త ప్రారంభానికి సూచికలు. కష్టకాలంలో ఉద్యోగం కోల్పోతే కెరీర్ పై ఆ ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి ఉన్నా లేకపోయినా ప్రస్తుతం కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం కంటే ఉన్న ఉద్యోగంలోనే పరిస్థితులు మారే వరకు కొనసాగడం మంచిది. కొత్తగా ఉద్యోగాలు వెతుక్కునేవారు ఈ సమయంలో నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం ఉత్తమం. 
 
కెరీర్‌ నిర్మించుకోవడంలో నెట్‌వర్క్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. నెట్‌వర్క్‌ను పెద్దది చేసుకుంటూ కెరీర్ విషయంలో ముందడుగులు వేయాలి. స్నేహితులు, మాజీ సహోద్యోగులు, కాలేజీ ఫ్రెండ్స్‌తో నెట్‌వర్క్ ఏర్పరచుకుని కెరీర్ లో ముందడుగులు వేయడానికి ప్రయత్నించాలి. కొత్త ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కెరీర్ విషయంలో కొత్త మార్గాలను వెతుక్కోవాలి. 
 
కొత్త నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల పలు అవకాశాలు పెరుగుతాయి. ప్రొఫైల్‌లో మీ నైపుణ్యాలను ప్రస్తావించడం వల్ల త్వరగా కొత్త అవకాశాల దారులు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రోగ్రామింగ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, ఆటోమేషన్‌ వంటి కోర్సులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. కెరీర్‌కు తగ్గట్టుగా మీ ప్రొఫైల్‌లో, నైపుణ్యాలలో మార్పులు చేసుకుంటూ ముందడుగులు వేస్తే కెరీర్ లో సక్సెస్ సాధించడం సాధ్యమే.                                        
 

మరింత సమాచారం తెలుసుకోండి: