మనలో ప్రతి ఒక్కరూ సక్సెస్ కోసం ఎంతో శ్రమిస్తారు. అయితే ఎంత కష్టపడినా కొన్ని సందర్భాల్లో మనల్ని సక్సెస్ బదులుగా ఫెయిల్యూర్ పలకరిస్తూ ఉంటుంది. అర మార్కు, ఒక మార్కు వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య కోకొల్లలు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఫెయిల్యూర్ ను చవిచూస్తారు. అయితే ఆ ఫెయిల్యూర్ ను ఎలా తీసుకున్నారనే దానిని బట్టే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 
 
సాధారణంగా మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరుణంలో వివిధ కారణాల వల్ల సాధనలో ఫెయిల్యూర్ ఎదురుకావచ్చు. కానీ ఆ ఫెయిల్యూర్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే ఆ ఓటమే పునాదిరాయిగా మారి సక్సెస్ వైపు అడుగులు వేసేలా చేస్తుంది. ఓటమిని ఫీడ్ బ్యాక్ లా తీసుకుంటే మాత్రమే కెరీర్ లో సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది. అయితే ఈ సమయంలో గతంలో చేసిన తప్పులను మాత్రం మరిచిపోకుండా సక్సెస్ కోసం అడుగులు వేయాలి. 
 
ఓటమి అంటే మరోసారి తిరిగి ప్రయత్నించాలని అర్థం. మనం ఎక్కడైతే ఆగామో అక్కడినుంచి మన ప్రయాణాన్ని మొదలుపెట్టాలని అర్థం. ఓటమిపాలైన తరువాత నిరాశానిస్పృహలకు లోను కాకుండా సక్సెస్ కోసం ప్రయత్నిస్తే మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. జీవితంలో ఓటముల లోతును చూసిన వాళ్లు విజయాల ఎత్తులను సులభంగా చూడగలుగుతారు. 
 
కొన్ని సందర్భాల్లో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితాలను సాధించడం సాధ్యం కాదు. ఏం చేస్తే విజయం వస్తుందో ఆలోచించి సక్సెస్ కోసం ప్రయత్నిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతాం. ఓటమిని అంగీకరించి దాని నుంచి పాఠాలు నేర్చుకుని కోరుకున్న లక్ష్యం వైపు మనం ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. కొత్త ప్రణాళికతో, కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో ముందడుగులు వేయాలి. ఈ విధంగా శ్రమిస్తే మనం జీవితంలో ఎంచుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతాం.      

మరింత సమాచారం తెలుసుకోండి: