కావలసిన పదార్థాలు: క్యారెట్ : 10 గ్రా.లు  బీన్స్ : 10 గ్రా.లు  గోబీ : 5 గ్రా.లు    బఠాణీలు :1 గ్రా.లు  బేబీకార్న్ : 1 గ్రా.లు   మిరియాలు : 1 గ్రా.లు    పచ్చి కొబ్బరి : 1 గ్రా.లు  అల్లం, వెల్లుల్లి పేస్ట్ :1 గ్రా.లు   గరం మసాలా :1 గ్రా.లు   జీలకర్ర : 1 గ్రా.లు  ధనియాలు : 1 గ్రా.లు  టమాటాలు : 5 గ్రా.లు   కొత్తిమీర : 1కట్ట ఉల్లిగడ్డ : 1 ఎండు మిరపకాయలు : 2.  అల్లం, వెల్లుల్లి పేస్ట్ :తగినంత   జీలకర్రపొడి : కొంచెం పసుపు, ఉప్పు, కారంపొడి, : తగినంత నూనె : తగినంత  తయారుచేయు విధానం: కడాయిలో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేయించి పొడి చేయాలి. పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేయాలి. టమాటాలను ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, గోబీ, బేబీకార్న్ అన్ని కలిపి నీళ్లు పోసి కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.  కడాయిలో నూనె పోసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఉడికించిన కూరగాయలను వేయాలి. పదినిమిషాల తర్వాత టమాటా పేస్ట్, ముందు తయారు చేసుకున్న పొడి, పచ్చికొబ్బరి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉప్పు, కొత్తిమీర వేస్తే నోరూరించే వెజిటేబుల్ చటినాడు మీ ముందుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: