ఎగ్ డ్రాప్ సూప్ కావలసిన పదార్థాలు: ఆలుగడ్డ ముక్కలు : అర కప్పు క్యారెట్ ముక్కలు : అర కప్పు బీన్స్ ముక్కలు : మూడు చెంచెలు కార్న్ ఫ్లోర్ : అర చెంచెడు మిరియాల పొడి : పావు చెంచెడు అజీనా మోటో : అర చెంచెడు సోయా సాస్ : సరిపడా నూనె : సరిపడా కొత్తిమీర : కొద్దిగా ఉప్పు : తగినంత తయారు చేసే పద్ధతి: ముందుగా ఎగ్స్‌ను బాగా గిలక్కొట్టి పెట్టుకోవాలి. అలాగే, ఆలుగడ్డ ముక్కలు (ఉడికించినవి) పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. మూకుడులో నూనె వేసి వేడయ్యాక క్యారెట్, బీన్స్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించాలి. అందులో ఆలుగడ్డ పేస్టు, మిరియాల పొడి, అజినా మోటో వేసి కలపాలి. అందులో నీరు పోసి మరుగుతున్నప్పుడు కార్న్‌ఫ్లోర్‌ను ఒక కప్పు నీటిలో ఉండలు లేకుండా కలిపి అందులో పోసి తర్వాత సోయాసాస్ గిలక్కొట్టిన ఎగ్‌ను కొద్ది కొద్దిగా పోస్తూ రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దించాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే సిప్ చేస్తేనే రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: