ఉగాది పచ్చడి - ప్రాముఖ్యత: ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక - తయారు చేయువిధానం:    బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: