టమాటతో ఎన్నో రకాల వంటకాలు వండుతుంటారు. వెజ్, నాన్ వెజ్ లో టమాట మిక్సింగ్ తో రక రకాల వెరైటీ వంటకాలు చేయడం చూస్తునే ఉంటాం.  టమాట జూస్ ని పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు.  టమాటతో నువ్వుల పచ్చిడి ఎలా చేస్తారో చూద్దామా!


కావల్సిన పదార్థాలు: టమోటోలు: 2 నువ్వులు: 2 tsp పచ్చిమిర్చి: 2 ఎండు మిర్చి: 3-6 చింతపండు పేస్ట్: 2 tsp ఉప్పు: రుచికి సరిపడా నూనె: తగినంత తయారు చేయు విధానం:  ముందుగా నువ్వులను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేయించికొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.


తర్వాత ఎండు మిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అలాగే టమోటో ముక్కలు కూడా వేసి నీరు పోయేంత వరకూ వేయించు కోవాలి. తర్వాత చింతపండు గుజ్జును టమోటోముక్కల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకొన్న నువ్వులను, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకొన్న టమోటో చింత గుజ్జుతో సహా వేసి, ఉప్పు కూడా వేసి మరో సారీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే నువ్వుల టమోటో చట్నీ రెడీ. దీన్ని వేడి వేడి గ్రీ రైస్ తో టింటే చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: