మునగ కాడలు :  3 కందిపప్పు :  1/2 కప్ చెనిగి బాళ్ళు : 1/4 కప్ చెక్క :  1/2 ముక్కలు ఏలకలు - 2 అల్లం, వెల్లుల్లి పెస్ట్ :  2 టీస్పూన్   జిలకర్ర : 1 టీస్పూన్ కారం : 1 టీస్పూన్ ఉప్పు : రుచికి సరిపడ ధనియాల పోడి :1టీస్పూన్     పసుపు : చిటికెడు చింతపండు : తగినంత ఉల్లిపాయ : 1 టమోటో : 2 ఆవాలు : 1టీస్పూన్   కొత్తిమిర : కొద్దిగా ఆయిల్ :  2టేబుల్ స్పూన్   తయారు చేయు విధానం  మొదట మునగకాడలను 3 ఇన్చ్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.


 స్టౌ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో కందిపప్పు, చెనగ బ్యాళ్ళు, జిలకర్ర వేసి వేసి వీటిని మిక్సిలో వేసి ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమిర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.  కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, కరివేపాకు, ముందుగా తయారు చేసుకొన్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ప్రై చేయాలి.   తర్వాత టమోటా ముక్కలను వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న మునగకాడలను వేసి కావలసినంత నీరు పోసి రెండు విజల్ కి దింపుకోవాలి. అంతే మునగకాడ మసాలా రెడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: