మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించెడివారు.  వారము రోజులు అనగా ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరించెడివారు. వీటినే ఏడు వారాల నగలు అంటారు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, కమ్మలు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండ కడియము (వంకీ), ఉంగరాలు మొదలగు ఆభరణాలను ధరించెడివారు.ఏ రోజున ఏయే నగలు ధరించెడివారు.


ఆదివారము - సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగున్నవి. 

సోమవారము - చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి.

మంగళవారం   కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి.

బుధవారం -  బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.

గురువారము - బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు మొదలగునవి.

శుక్రవారం - శుక్రుని కోసము వజ్రాల హారాలు, ముక్కుపుడక మొదలగునవి.

శనివారము - శని ప్రభావం పడకుండా ఉండడం కోసం నీలమణి హారాలు మొదలగునవి.

ఇదీ ఏడు వారాల నగల ప్రత్యేకత. మనం నగలు ధరించడం అంటే కేవలం అలంకారానికి హోదా ప్రదర్శనకు మాత్రము కాదు. అంతరార్థం వేరు. మనకు గ్రహాల అనుకూలత కోసం, ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఏర్పరచినదే ఈ ఏడు వారాల నగలు. ఈ ఏర్పాటు ఘనత మన పెద్దలది. 

వారికి మన శతకోటి వందనాలు


మరింత సమాచారం తెలుసుకోండి: