..................................... మహిళలకు ఇవి ఉచితం...!! .......................................... ' ఫీడ్‌ ది నీడ్‌ ' పేరిట సామాజిక సేవ మొదలు పెట్టిన యాపిల్‌ హోమ్‌ ఎన్జీఓ నిరుపేద మహిళల కోసం మరో వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. షీ నీడ్‌ పేరిట మొదలైన ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా శానిటరీప్యాడ్లు అందించబోతున్నారు. యాపిల్‌ హోం వ్యవస్థాపకురాలు డాక్టర్‌ నీలిమా ఆర్య మాట్లాడుతూ, ' జీహెచ్‌ఎంసీతో కలిసి 'షీ నీడ్‌' ప్రాజెక్టును ప్రారంభించాం. యాపిల్‌ హోమ్‌ ద్వారా నగరంలోని 20 ప్రాంతాల్లో రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేసి, హోటళ్లు, విందు, వివాహాల సమయంలో మిగిలిన నాణ్యమైన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లలో ఉంచితే.. పేదలు ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో శానిటరీ న్యాప్కిన్‌ కియోస్కలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాము...' అని ఆమె అన్నారు. బటన్‌ నొక్కితే ప్యాడ్‌ !! ఒక్కో కియోస్కలో మొదట 50 ప్యాడ్లు అందుబాటులో ఉంచి, అవసరాన్ని బట్టి మున్ముందు వాటి సంఖ్య మరింత పెంచుతారు. బటన్‌ నొక్కితే శానిటరీప్యాడ్‌ వచ్చేలా కియోస్కల్లో ఏర్పా ట్లు ఉంటాయి. వాడేసిన ప్యాడ్లను కాల్చివేసేందుకు ఇన్సినెరేటర్‌ కూడా కియోస్కల్లో ఉంటుందని, ఇది పర్యావరణహిత ప్రాజెక్టు, నగరంలోని పలు ప్రాంతాల్లో కియోస్కలు ఏర్పాటుచేసి వైద్యపరంగా పరీక్షించిన శానిటరీ ప్యాడ్‌లను ఉంచుతామని నీలిమా ఆర్య చెబుతున్నారు. ఉసాధి అవకాశాలు స్వయం సమృద్ధి అనే భావనతో ఏర్పాటుచేసే ఒక కియోస్కల్లో ఖాళీ స్థలాన్ని, కుట్టుమిషన్‌, జిరాక్స్‌ మిషన్లు, ఫ్యాన్సీ ఉత్పత్తుల అమ్మకం ద్వారా జీవనోపాధి పొందే వారికి, ఉచితంగా స్థలం, విద్యత్‌ సరఫరా సౌకర్యాలు కల్పిస్తామని, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కళాశాలల్లో కియోస్కల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని నీలిమ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: