కావలసిన వస్తువులు: పండుమిర్చి తురుము : 1/2 కప్పు చింతపండు : చిన్న నిమ్మకాయంత పాలకూర : 1 కప్పు జీలకర్ర : 1/2 టీ స్పూను ఆవాలు : 1/4 టీ స్పూను ధనియాలు :1 టీ స్పూను కరివేపాకు : 1 రెమ్మ ఉప్పు : తగినంత నూనె : 4 టీ స్పూను తీసుకోవాల్సి ఉంటుంది. 

తయారీచేసేవిధానం :  ప్యాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి సన్నగా తరిగిన పండుమిర్చి ముక్కలు, పాలకూర, సగం జీలకర్ర, ధనియాలు దోరగా వేయించుకొవాలి. ఇందులో తగినంత ఉప్పు, నారతీసిన చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బుకున్న చింతపండును బౌల్ లోకి తీసుకోవాలి.

మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేయించి రుబ్బుకున్న పచ్చడిలో కలపాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా బావుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: