ఆమ్మో నా జుట్టు ఊడుతుంది…అంటూ ఈ రోజుల్లో ఎక్కువమంది ఎంతో మానసికక్షోభను అనుభవిస్తున్నారు. ఏంటి జుట్టు ఊడుతుంటే మానసికక్షోభ ఎందుకు అని తేలిగ్గా తీసిపారేయకండి. జుట్టుకు మన దేశంలో ఉన్న ప్రాధాన్యత ఏ దేశంలోనూ ఇవ్వరు. అది పక్కన పెడితే, మనం ఎదుటివారికి మరింత అందంగా కనిపించాలంటే మన జుట్టు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ, ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు, ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా జుట్టు రాలిపోవడం సర్వ సాధారణముగా మారిపోయింది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే రాలిపోయిన దగ్గర జుట్టును మళ్ళీ వికసింపజేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు . అయితే అసలు జుట్టు ఊడటానికి గల కారణాలు, జాగ్రత్తలు, చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఇలా జుట్టు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

ముఖ్యంగా ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఎవరైతే ఎక్కువ ఒత్తిడికి గురవుతారో వారికే మొదటగా మొదలవుతుందట. అంతే కాకుండాసరైన ఆహార నియమాలు పాటించక పోవడం కూడా ఈ జుట్టులేమి సమస్యకు ముఖ్యకారణం.
ఈ సమస్యతో బాధపడుతున్న 40 శాతం మందిలో జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
విటమిన్ల లోపం కూడా కారణమే, మీ శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోయినా, అపరిశుభ్రమైన చర్మముతో ఉన్నా జుట్టు అధికంగా రాలిపోతుందట.
ఈ రోజుల్లో గాలి కాలుష్యం కూడా జుట్టుకు ఒక పెద్ద సమస్యగా మారింది. దానికి తోడు ఈ రోజుల్లో ఎక్కువమంది రోజు వేడినీళ్లతో తల స్నానం చేస్తున్నారు. దానివలన జుట్టు పలచబడి త్వరగా ఊడిపోయే అవకాశాలున్నాయి.
ఇకపోతే వాణిజ్య ప్రకటనలో కనిపించే అన్ని రకాల సాంపూలను, ఆయిల్స్ ను వాడితే ఇలాగే అవుతుంది. 


ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు .. 

పూర్వం లో ఎక్కువశాతం ఎవరైనా తలస్నానం చేయడానికి కుంకుడుకాయలే ఉపయోగించేవారు. ఇప్పటిలా రకరకాల హెయిర్ స్టైల్స్ అప్పట్లో లేవు. కాబట్టి బాగా కొబ్బరినూనె పట్టించి కుంకుడుకాయలతో తలస్నానం చేసి చక్కగా జడ వేసుకుంటే మీ జుట్టు ఒత్తుగా ఉంటుందట అంతేకాకుండా మహిళలు ఉసిరికాయతో తయారు చేసిన నూనె జుట్టుకు ఉపయోగిస్తే నునుపైన జుట్టు మీ సొంతమౌతుంది.
మీరు నిద్రపోయే సమయంలో ఒక 5 బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే దానితొక్కను తీసి పుచ్చుకుంటే మీ జుట్టు రాలిపోయే సమస్యను అరికట్టవచ్చు. వీటితోపాటు ఒక కప్పు మొలకెత్తిన పప్పుధాన్యాలను కూడా తీసుకోండి.
జుట్టు రాలకుండా ఉండలాంటే మీ చర్మం పొడిబార కుండా ఉండాలి. మీ చర్మం తాజాగా ఉంటే మీ జుట్టు కూడా పటుత్వం కలిగి ఉంటుంది. దీనికోసం నిమ్మ రసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి ప్రతిరోజు తీసుకోండి. మంచినీళ్లు కూడా రోజులో 3-5 లీటర్లు తగ్గకుండా చూసుకోవడం మంచిది.
మీ జుట్టు ఒత్తుగా ఉండాలంటే ప్రోటీన్స్ అవసరం అవుతాయి. కాబట్టి గుడ్లు, మాంసం, పాలు తరచు తీసుకోవడం మంచిది. అలాగే రోజులో కాఫీలు, టీలను తీసుకోవడం తగ్గించండి.
చూసారుగా అదండీ జుట్టు పోతుందనే బాధలోంచి బయటకొచ్చి మీ జుట్టును మీరే కాపాడుకోండి.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: